అక్కినేని బుల్లోడు అఖిల్ కెరీర్ షేపప్ అవుతున్న విధానంపై కింగ్ నాగార్జున ఏమంత సంతృప్తిగా లేరు. అయితే ఆరంభం ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్న అనుభవం తనకూ ఉంది కాబట్టి అఖిల్ కి కావాల్సినంత ఛాయిస్ ని ఇస్తున్నారు. అతడు తనకు తానుగానే నిరూపించుకోవాలన్నది నాగార్జున పంతం. అందుకు తగ్గట్టే అక్కినేని చియాన్ అలుపెరగక రేయింబవళ్లు హార్డ్ వర్క్ చేస్తున్నాడు.
ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు. స్పై థ్రిల్లర్ కాన్సెప్టుతో భారీ యాక్షన్ ని మేళవించి సూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దానికి తగ్గట్టే అఖిల్ కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. తనని తాను నిరూపించుకోవాలన్న కసి కనిపిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ తరవాత రెట్టించిన కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.
అక్కినేని చియాన్ అఖిల్ హార్డ్ వర్క్ ఏ రేంజులో ఉంటుందో ఇప్పటికే మారిన అతడి రూపం చెబుతోంది. అతడు మాన్ స్టర్ లా మారాడు. బీస్ట్ ని తలపిస్తున్నాడు. దీనికోసం జిమ్ లో అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అవసరం మేర కోచ్ సహాయం కూడా తీసుకుంటున్నాడు.
ఇక ఆదివారాల్ని కూడా విడిచిపెట్టకుండా అతడు జిమ్ లో శ్రమిస్తున్న తీరు చూస్తుంటే ఆ కసిని మెచ్చుకుని తీరాల్సిందే. అఖిల్ బీస్ట్ లుక్ ఇప్పటికే వైరల్ అయినా ఇప్పుడు మరో కొత్త ఫోటోని రిలీజ్ చేశాడు. జిమ్ లో మిర్రర్ లో తనని తాను చూసుకుంటూ కనిపించాడు. సండే విశ్రాంతి లేదు... అది ఫ్లెక్స్ డే అంటూ ప్రకటించాడు. మొత్తానికి విరామం అనేది అతడికి లేదని చెప్పకనే చెప్పాడు.
ఏజెంట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యేవరకూ అసలు రెస్ట్ అన్నదే లేదు. స్పై కాన్సెప్టులతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టే వ్యూహం ఉందా లేదా? అన్నది కూడా అఖిల్- సూరి డిక్లేర్ చేయాల్సి ఉంది. అలాగే ఏజెంట్ రిలీజ్ తేదీ.. ప్రమోషన్ల పైనా మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అన్నట్టు అఖిల్ బీస్ట్ లా మారాడు. కేజీఎఫ్ 3లో చేరతాడా? అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.