అఖిల్-హను.. రద్దు కాలేదా?

Update: 2016-09-27 05:14 GMT
ఒక ఆసక్తికర కాంబినేషన్ చూసే అవకాశం మిస్సయిందని ఫీలవుతున్నారు తెలుగు ఫిలిం లవర్స్. అక్కినేని యువ కథానాయకుడు అఖిల్.. ‘అందాల రాక్షసి’.. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన హను రాఘవపూడి కాంబినేషన్లో సినిమా తెరమీదికి వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. ఇక ప్రకటనే తరువాయి అనుకున్న టైంలో ఇద్దరూ ఈ ప్రాజెక్టు వదిలేసి వేరే దారులు చూసుకున్నారు. హను ఆల్రెడీ నితిన్ హీరోగా సినిమా మొదలుపెట్టేస్తే.. అఖిల్ విక్రమ్ కుమార్ ను లైన్లో పెట్టాడు. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అటకెక్కేసినట్లే అని అంతా ఫిక్సయిపోయారు. ఐతే తాజా సమాచారం ఏంటంటే.. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో ఉందంతే. రద్దయిపోలేదు.

హను తన తర్వాతి సినిమాను 14 రీల్స్ వాళ్లకే చేయాల్సి ఉండటం.. అఖిల్ అందుకు ఒప్పుకోకపోవడం వల్ల వీళ్లిద్దరూ ఓకే అనుకున్న కథను ఇప్పుడు తెరకెక్కించలేకపోయారు. నితిన్ తో 14 రీల్స్ సినిమా పూర్తి చేశాక.. హను మళ్లీ తాను ముందు అనుకున్న కథతోనే అఖిల్ తో సినిమా చేస్తాడట. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందట. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ఉండొచ్చని సమాచారం. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్లు నిర్మించిన ‘మైత్రీ మూవీ మేకర్స్’ సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్లో తమ తర్వాతి సినిమాను త్వరలోనే మొదలుపెట్టబోతోంది. మొత్తానికి ఈ హీరో.. దర్శకుడు.. నిర్మాతలు ముగ్గురూ కూడా వేర్వేరు ప్రాజెక్టులు కమిటై ఉన్నారు. అవి పూర్తికాగానే ముగ్గురూ కలిసి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News