అఖిల్ పెళ్ళి.. నిజంగానే క్యాన్సిలైందా??

Update: 2017-02-22 06:54 GMT
ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది ఖచ్చితంగా అఖిల్ పెళ్ళి న్యూస్ అనే చెప్పాలి. అసలు ఈ యంగ్ హీరో పెళ్ళి కుదిరింది అనగానే ఎంత షాక్ తిన్నారో ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి పెళ్ళికి వెన్యూ సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు ఆ పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందీ అంటే అంతకంటే ఎక్కువ షాకింగ్ గా ఉంది. అక్కినేని అఖిల్ మరియు జివికె వారి మనువరాలు శ్రీయ భూపాల్ లకు గత డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే.

మ్యాటర్ లోకి వెళితే.. అఖిల్ పెళ్ళికి సంబంధించి ఇటలీలోని ఒక నగరంలో చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెన్యూ ఫైనల్ చేయడం.. గెస్టులకు రూములు ఎలాట్ చేయడం.. ఇండియా నుండి అక్కడికి చేరుకోవడానికి కావల్సిన ఎయిర్ టిక్కెటింగ్ వగైరా పనులన్నీ జరిగిపోతున్నాయి. అయితే సడన్ గా అందరినీ ఈ ఎయిర్ టిక్కెట్లు మరియు ఇతర ఏర్పాట్లను క్యాన్సిల్  చేసుకోవాల్సిందిగా కోరుతూ జివికె ఫ్యామిలీ మరియు అక్కినేని ఫ్యామిలీ నుండి రిక్వెస్టులు వచ్చినట్లు రూమర్లు షికారు చేస్తున్నాయి. దానికితోడు ఈ వెడ్డింగ్ మరియు రిలేషన్షిప్ క్యాన్సిల్ అయిపోయినట్లు ఈరోజు 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్' 'టైమ్స్ ఆఫ్‌ ఇండియా' మొదలగు పత్రికల ఆన్ లైన్ ఎడిషన్లో వార్తలు వచ్చేశాయి.

సదరరు న్యూస్ రిపోర్టుల సారాంశం చూస్తే.. ''అఖిల్ మరియు శ్రీయకు మధ్యన కొన్ని విభేదాలు వచ్చాయి. వాటిని సాల్వ్ చేయాలని ఇటు నాగార్జున అటు జివికె రెడ్డి ఎంత ప్రయత్నించినా కూడా.. ఆ కపుల్ మధ్యలో ఏర్పడిన విభేదాలు తొలగలేదు. దానితో చేసేదేం లేక ఇక ఈ పెళ్ళి ఆపేయాలని పెద్దలు నిశ్చయించుకున్నారు'' అని పబ్లిష్‌ చేశారు.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కాని... అక్కినేని ఫ్యామిలీ లైమ్ లైట్ లో ఉండే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి.. ఒకవేళ వారు ఏమైనా అఫీషియల్ గా క్లారిటీ ఏదైనా ఇస్తారేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News