ట్యాటూ బాణం వేస్తున్న అఖిల్

Update: 2017-07-05 16:58 GMT
అక్కినేని వంశానికి నవతరం వారసుడు అఖిల్.. ప్రస్తుతం తన రెండో సినిమాను ప్రతిష్టాత్మంగా భావించి.. ఎన్నో ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఎలాగైనా సక్సెస్ సాధించాలనే కసితో.. ఎంతటి రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ లను అయినా స్వయంగా చేసేస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి.. ఇప్పటివరకూ కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే చిత్రీకరించడం విశేషం.

మరోవైపు అఖిల్ ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. తన కాబోయే వదిన సమంతతో కలిసి.. అఖిల్ ఓ షాపింగ్ మాల్ కు అండార్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షాపింగ్ చైన్ కు చెందిన ఓ మాల్ లో జరిగిన ఈవెంట్ కు సమంత- అఖిల్ ఇద్దరూ అటెండ్ అయ్యారు. రిబ్బన్ కటింగ్ తర్వాత.. ఇద్దరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సమయంలో అఖిల్ చేతిపై ఓ కొత్త ట్యాటూ అందరినీ ఆకట్టుకుంది. దీనిలో ఓ పెద్ద బాణం గుర్తు.. మణికట్టు నుంచి అరచేతికి కొంతదూరం వరకూ ఉంటుంది. బాణం పాయింట్ చివర ఓ ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది. అంటే అఖిల్ చేతిపై ఉన్న బాణం అనంతంలోకి గురి పెట్టినట్లన్న మాట.

ఈ ట్యాటూ పర్మనెంట్ అయే అవకాశాలు తక్కువే. ప్రస్తుతం చేస్తున్న సినిమాలోని థీమ్ కు తగినట్లుగా ఈ ట్యూటూ వేయించుకుని ఉండొచ్చని తెలుస్తోంది. రీసెంట్ గానే సమంత- చైతు ఇద్దరి చేతులపై కలిపి ఓ యారో సింబల్ ట్యాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందే సమంత ఒంటిపై రెండు ట్యాటూలు ఉన్నాయి. వీరి కంటే ముందే తన భుజంపై ఓం సింబల్ వేయించుకున్నాడు నాగార్జున. మొత్తానికి అక్కినేని ఫ్యామిలీ అంతా ట్యాటూలతో భలే ఆకట్టుకుంటున్నారులే.



Tags:    

Similar News