అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. అఖిల్ కు మొదటి కమర్షియల్ సక్సెస్ గా ఈ సినిమా నిలిచింది అనడంలో సందేహం లేదు. మంచి వసూళ్లను దక్కించుకున్న అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను తాజాగా ఆహా లో స్ట్రీమింగ్ చేశారు. ఆహాలో స్ట్రీమింగ్ కు ముందు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు. ఆహాలో ఈ సినిమా ను ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్ట్రీమింగ్ చేసినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
బ్యాచిలర్ ఆహా లో స్ట్రీమింగ్ అయిన రెండు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ ల నిమిషాల రన్ టైమ్ ను దక్కించుకుంది అంటూ ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించారు. తక్కువ సమయంలో ఇంత భారీ రన్ టైమ్ దక్కడం చూస్తుంటే బ్యాచిలర్ సినిమా మరోసారి విజయం సాధించినట్లుగా అనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేక పోవడంతో ఇలా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేశారు. ఆహా లో స్ట్రీమింగ్ మొదలు అయిన వెంటనే భారీగా జనాలు ఓటీటీ స్టీమింగ్ కు సిద్దం అయ్యారని తెలుస్తోంది.
అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే నటించగా బన్నీ వాసు నిర్మాణంలో అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పించారు. అఖిల్ మరియు పూజా హెగ్డేల కాంబో సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఆకట్టుకునే కథ మరియు కథనంతో పాటు మంచి పాత్రలతో కథను నడిపించిన తీరు ఆకట్టుకుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఇచ్చిన డబుల్ ధమాకా విజయం తర్వాత అఖిల్ గేరు మార్చినట్లుగా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాను చేస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి కరోనా రావడంతో షూటింగ్ కు అంతరాయం కలిగింది. వచ్చే ఏడాదిలో సమ్మర్ కి ఈ సినిమా ను విడుదల చేయాలని ఆశిస్తున్నారు.