వదిన కోసం అఖిల్ కేరింగ్

Update: 2017-07-08 08:56 GMT
అక్కినేని నాగ చైతన్య.. సమంత మరో 3 నెలల్లో పెళ్లి పీటలు ఎక్కేయనున్నారు. ఏళ్ల తరబడి కొనసాగిన తమ ప్రేమ కథకు.. పెళ్లితో శుభం కార్డు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే.. ఇప్పటివరకూ చైతు గురించి సమంత చెప్పడమే తప్ప.. సామ్ గురించి చెయ్ చెప్పిన సంగతులు చాలా తక్కువ. పర్సనల్ సంగతులు చెప్పాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందంటూ ఓపెన్ గానే చెప్పాడు నాగ చైతన్య.

కానీ ఈ విషయంలో యంగ్ హీరో అఖిల్ కి మాత్రం దూకుడు ఎక్కువే. సోషల్ మీడియా సాక్షిగానే.. చాలాసార్లు ఓపెన్ గా వదినపై అభిమానాన్ని కురిపించాడు. ఇక రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన అయితే.. సమంత వదినపై అఖిల్ ఎంతటి ఆప్యాయత కురిపిస్తాడనే విషయాన్ని బైటపెట్టింది. వీరిద్దరూ ఓ షాపింగ్ మాల్ కు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ రిబ్బన్ కటింగ్ కు సమంత.. అఖిల్ ఇద్దరూ వెళ్లగా.. అక్కడ జనాలు చుట్టుముట్టేశారు. వారి నుంచి సమంతను చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాడు అఖిల్.

చుట్టూ బౌన్సర్స్ ఉన్నా సరే.. వదినను తనే జాగ్రత్తగా తీసుకెళ్లడం విశేషం. ఓ సమయంలో సమంతను చుట్టుపక్కల వాళ్లంతా ఆపేస్తే.. చెయ్యి పట్టుకుని మరీ తీసుకెళ్లిపోయాడు అఖిల్. వదిన- మరిది ఆప్యాయత చూసి.. అక్కడున్న చాలా మంది షాక్ కి గురయ్యారంటే ఆశ్చర్యమేమీ లేదు.
Full View

Tags:    

Similar News