హీరోగా అఖిల్ ఎంట్రీ ఇవ్వడానికి ముందే అతనికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. యూత్ లో అతనికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. టాలీవుడ్ తెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావుకి మనవడు, సీనియర్ స్టార్ హీరో నాగార్జున గారాల తనయుడు కావడంతో సహజంగానే అఖిల్ ఎంట్రీ ప్రత్యేకతను సంతరించుకుంది. నిజం చెప్పొద్దూ .. అఖిల్ ఎంట్రీ ఇస్తున్నాడనేసరికి యువ కథానాయకులు తమకి గట్టిపోటీ ఎదురవుతుందని భావించారు. ఆయన కొత్త రికార్డులకు తెరతీస్తాడనే ఫ్యాన్స్ ఆశించారు.
'అఖిల్' తన పేరుతోనే ఫస్టు మూవీ చేశాడు. ఇటు యూత్ .. అటు మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన వీవీవినాయక్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. భారీ బడ్జెట్ తో దాదాపు విదేశాల్లోనే ఈ సినిమా నిర్మాణం కొనసాగింది. అయితే ఖర్చుకు తగిన కథ లేకపోవడంతో ఈ సినిమా పరాజయం పాలైంది. ఫస్టు సినిమాతోనే హిట్ కొడతాడని ఆశపడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నెక్స్ట్ మూవీ విషయంలో తొందర పడకూడదనే ఉద్దేశంతో, కొంత గ్యాప్ తీసుకుని మరీ 'హలో' స్టోరీకి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన 'హలో' సినిమా కూడా యూత్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇది ప్రేమకథే అయినప్పటికి యూత్ కి కనెక్ట్ కాలేకపోయింది. సాధారణంగా హీరో .. హీరోయిన్ ఇద్దరూ కలిసి ఆడిపాడితే చూడాలని యూత్ ముచ్చటపడుతుంది. హీరోయిన్ ను వెతకడంతోనే హీరో కాలాన్ని వృథా చేయడం ఈ సినిమాకి మైనస్ అయింది. టేకింగ్ పరంగా బాగున్నప్పటికీ, ఆడియన్స్ ఆశించిన అంశాలు మిస్ అయ్యాయి. అలా రెండో సినిమా కూడా అఖిల్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచే ఫలితాన్నే ఇచ్చింది. పొరపాటు ఎక్కడ జరుగుతుందా అని బాగా ఆలోచించిన అఖిల్, ఆ పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకుంటూ 'మిస్టర్ మజ్ను' చేశాడు.
'మిస్టర్ మజ్ను' కూడా కాన్సెప్ట్ పరంగా దెబ్బకొట్టేయడంతో, మరోసారి అఖిల్ కెరియర్లో పరాజయమే నమోదైంది. దాంతో అఖిల్ మరింత పట్టుదలతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. సెట్స్ పైకి వెళ్లడానికి జరిగిన ఆలస్యం .. లాక్ డౌన్ కారణంగా అయిన ఆలస్యం వలన ఈ సారి మరింత గ్యాప్ వచ్చేసింది. పూజా హెగ్డేను జోడీగా చేసుకుని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' గా అఖిల్ కొత్త ఏడాదిలో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అఖిల్ కి న్యూ ఇయర్ అగ్ని పరీక్షే కానుంది. ఈ సారి ఆయన హిట్ కొట్టడం ఖాయమనే ఫ్యాన్స్ అంటున్నారు .. అదే జరుగుతుందేమో చూడాలి మరి.