అఖిల్.. అంత అడుగుతున్నాడా?

Update: 2018-03-13 06:27 GMT
పెద్ద నిర్మాత అన్నాక కేవలం బారి బడ్జెట్ సినిమాలే కాకుండా కొంచెం చిన్న తరహా సినిమాలను కూడా చేస్తుండాలి. అప్పుడే మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రస్తుతం అదే తరహాలో తన బ్యానర్ కి గుర్తింపు తెచ్చుకుంటున్నారు నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారు. ప్రభాస్ - పవన్ కళ్యాణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలతో చేసిన ఆయన లేటెస్ట్ ట్రెండ్ హీరోలతో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమాను నిర్మించి మంచి హిట్ అందుకున్నారు. శర్వానంద్ తో కూడా వర్క్ చేయడానికి సిద్దపడుతున్నారు. ఇకపోతే మరో కుర్ర హీరోతో కూడా సినిమా చేయాలనీ గత కొన్ని రోజులుగా ఈ బడా నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కుర్ర హీరో మరెవరో కాదు. అక్కినేని వారసుడు అఖిల్. తొలి రెండు సినిమాలతో కొంచెం తడబడ్డ ఈ హీరో నెక్స్ట్ అయినా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

అయితే రీసెంట్ గా వీరిద్దరి మధ్య చర్చలు జరుగగా అఖిల్ దాదాపు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భోగవల్లి ప్రసాద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే అన్నపూర్ణ స్టుడియోలోనే  అఖిల్ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ప్రసాద్ గారు అఖిల్ తో ఒక మంచి సినిమా చేయాలనీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. అయితే అఖిల్ మాత్రం ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ని అడుగుతుండడంతో కొంచెం ఆలోచనలో పడినట్లు టాక్.  
Tags:    

Similar News