ఫోటో స్టోరి: అఖిల్ నిశ్చితార్ధం కార్డ్ ఇదిగో

Update: 2016-11-01 15:40 GMT
బాలీవుడ్ అంతా డిసెంబర్ 9న ముద్దుల మూవీ 'బేఫికర్' కోసం ఎదరు చూస్తుంటే.. టాలీవుడ్ మాత్రం మరో ఈవెంట్ గురించి చర్చించుకోనుంది. అవును.. అదే రోజున యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ జరుగనుంది. ముందుగా సమంత అండ్ నాగ చైతన్య పెళ్ళయిన తరువాతనే వీరి ఎంగేజ్మెంట్ అనుకున్నారు కాని.. ఇప్పుడు ప్లాన్ మారింది కాబోలు.

ఈరోజు బయటకొచ్చిన ఒక ఇన్విటేషన్ కార్డ్ ప్రకారం చూస్తే.. అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ ఇప్పుడు శ్రీయ భూపాల్ తో.. వచ్చే డిసెంబర్ 9న జరుగనుంది. అది కూడా జివికె వారి ఇంట్లోనే ఈ ఈవెంట్ జరగనుండటం విశేషం. స్వయంగా నాగార్జున అండ్ అమల ఇప్పుడు ఈ కార్యక్రమం నిమిత్తం ఇన్విటేషన్లను అచ్చేయించారు. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ పీపుల్.. సోమనాద్రి భూపాల్ అండ్ షాలిని భూపాల్ కుమార్తె శ్రీయను తమ కొడుక్కు డిసెంబర్ 9, శుక్రవారం సాయంత్రం 7 గంటలకు నిశ్చితార్దం చేసుకుంటున్నట్లు ఈ ఇన్విటేషన్ ద్వారా వెల్లడైంది.  

ఇకపోతే అఖిల్ పెళ్ళి ఇటలీలో జరగనుందని ఇప్పటికే రూమర్లు వచ్చేయగా.. ఇప్పుడు అఖిల్ కొత్త సినిమా కూడా త్వరలోనే మొదలవ్వనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News