అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా నిరాశ పర్చాయి. ప్రస్తుతం ఈయన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సమయంలో అక్కినేని కాంపౌండ్ తో పాటు గీతాఆర్ట్స్ కాంపౌండ్ కూడా ఈ సినిమాను సక్సెస్ చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నారట. ఇప్పటికే ఒకటికి రెండు సార్లు కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయడంతో పాటు పదే పదే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారట. చివరకు షూటింగ్ పూర్తి చేసి ఎడిటింగ్ రూంకు సినిమాను తీసుకు వచ్చారు. సినిమా ఎలా తీసినా కూడా ఎడిటింగ్ విషయంలో కాస్త పొరపాటు జరిగినా కూడా ఫలితం తేడా కొడుతుంది. అందుకే ఎడిటర్ ది కీలక పాత్ర ఉంటుంది.
బ్యాచిలర్ సినిమాను ది బెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో పలువురు ఈ సినిమా ఎడిటింగ్ రూం లోకి వెళ్లారని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ నుండి మొదలుకుని నాగార్జున ఇంకా కొందరు ప్రముఖ దర్శకులు మరియుర రచయితలు కూడా ఎడిటింగ్ వర్షన్ ను చూసి తమకు తోచిన మార్పులు చేర్పులు చెప్పారట. ఏది ఏమైతేనేం సినిమా బాగా రావాలని ప్రతి ఒక్కరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సినిమా సక్సెస్ అయితే చాలని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాను సమ్మర్ కు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అఖిల్ కు జోడీగా ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మించిన విషయం తెల్సిందే.