రెండు రోజుల కిందటే రిలీజైన ‘హలో’ టీజర్ టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. టీజర్ చూస్తే.. కొంచెం రొమాన్స్.. కొంచెం ఎమోషన్ జోడిస్తూ.. యాక్షన్ ప్రధానంగా ఈ సినిమాను విక్రమ్ కుమార్ తీర్చిదిద్దినట్లుగా కనిపించింది. టీజర్లో ప్రధానంగా యాక్షన్ పార్ట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బ్రీత్ టేకింగ్ గా అనిపించే అక్కినేని అఖిల్ విన్యాసాలు టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ టీజర్ కు మూడు రోజుల్లోపే 50 లక్షల డిజిటల్ వ్యూస్ రావడం విశేషం. యూట్యూబ్ వ్యూస్ మాత్రమే 40 లక్షలకు చేరువగా ఉన్నాయి. అఖిల్ లాంటి కొత్త హీరో సినిమా టీజర్ కు ఈ స్థాయి వ్యూస్ రావడం విశేషమే.
ప్రస్తుతం ‘హలో’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆరంభం కాబోతున్నాయి. డిసెంబరు 22న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని కుటుంబానికి మనం లాంటి మరపురాని సినిమాను అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుంది. అఖిల్ తొలి సినిమాను బయటి వాళ్లకు ఇచ్చి దెబ్బ తిన్న నాగార్జున.. ఈసారి తనే నిర్మాతగా మారి ‘హలో’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లని అంటున్నారు. ఇందులో సగం బడ్జెట్ యాక్షన్ ఘట్టాలకే ఖర్చయిందట.