అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్న నాయన సినిమా కు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా రాబోతుందనే విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలైనప్పటి నుండి బంగార్రాజు సినిమా గురించి మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. గతంలో పలు సార్లు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. అందులో ప్రధానంగా ఈ సినిమాలో అఖిల్ నటించబోతున్నాడు అంటూ ఒకసారి లేదు నాగచైతన్య నటించబోతున్నాడు అంటూ మరో సారి పుకార్లు వచ్చాయి. నాగార్జున తాత పాత్రలో చైతూ మరియు అఖిల్ లు ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.
వాటిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో అవన్ని పుకార్లే అని వదిలేశారు. మళ్లీ ఇప్పుడు బంగార్రాజు సినిమా షూటింగ్ మొదలు అయిన నేపథ్యంలో అఖిల్ ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి. పూర్తి స్థాయి పాత్ర కాకుండా ఒక గెస్ట్ రోల్ తరహాలో బంగార్రాజు సినిమాలో అఖిల్ కనిపించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. సినిమాకు క్రేజ్ రావాలంటే ఇలాంటి మ్యాజిక్ లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే తండ్రి కొడుకులు బంగార్రాజులో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. అసలు విషయం ఏంటీ అనేది యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ వస్తే కాని తెలియదు. వచ్చే ఏడాది ఆరంభంలో బంగార్రాజు సినిమా ను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.