స్టార్ హీరోగా క్రేజ్ అందుకోవాలంటే ఎంతగా కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లాస్ ఆడియెన్స్ కంటే ఎక్కువగా మాస్ ఆడియెన్స్ నుంచి సపోర్ట్ రావాలి. ఒక క్లాస్ సినిమా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వలేదు. మాస్ సైడ్ ఆడియెన్స్ కి నచ్చితేనే ఆ స్థాయిలో హిట్ అవుతుంది. ఎక్కువగా మాస్ ఆడియెన్స్ టేస్ట్ క్లాస్ ఆడియెన్స్ కి ఉంటుంది. కానీ క్లాస్ సినిమాలు చాలా వరకు మాస్ వర్గానికి నచ్చవు.
ఇక అసలు విషయానికి వస్తే.. గత కొంత కాలంగా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని అక్కినేని యువ హీరో అఖిల్ చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. కాని చేసిన రెండు సినిమాలు ఏ మాత్రం హిట్ అవ్వలేదు. మాస్ ఆడియెన్స్ ను అఖిల్ మెప్పించలేదనే చెప్పాలి. ముఖ్యంగా నాగ్ అభిమానులు చాలా నిరాశ చెందారు. హలో లాంటి ప్రయోగాలు చేయవద్దని స్పెషల్ గా నాగార్జునను కలిసి రిక్వెస్ట్ చేశారట. దీంతో అఖిల్ ఇంతకుముందు ఒకే చేసిన అడ్వెంచర్ కథని వదులుకోవాల్సి వచ్చిందట.
ఒక మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ కథను చూడామని అక్కినేని సీనియర్ అభిమానులు సలహా ఇచ్చారట. అయితే ఇంతకు అఖిల్ చేయాలనుకున్న ఆ కథ ఎవరిదో తెలుసా?. ఆది పినిశెట్టి బ్రదర్ సత్య పినిశెట్టి సరికొత్త కథని చెప్పి నాగ్ ని మెప్పించాడు. అఖిల్ కి కూడా బాగా నచ్చేసింది. కానీ ఫ్యాన్స్ కారణంగా వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం. సత్య ఇంతకుముందు మలుపు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.