మళ్లీ ఆలస్యం చేస్తావా బాబూ!!

Update: 2018-01-30 04:20 GMT
అక్కినేని అఖిల్ ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడిపోయాడు. హీరోగా తన మొదటి సినిమాతో ఘోరమైన ఫలితాన్ని అందుకున్న ఈ అక్కినేని హీరో.. రెండో సినిమా విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. సుదీర్ఘ సమయం పాటు చర్చోపచర్చలు నిర్వహించి మరీ.. హలో మూవీ చేశాడు.

విక్రమ్ కె కుమార్ లాంటి ప్రామిసింగ్ డైరెక్టర్ తీసిన హలోకి మంచి రివ్యూలు రేటింగులు.. టాక్ వచ్చాయి. అన్నీ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఖర్చులో సగం దగ్గరే అయిపోయాయి. అలా రెండో సినిమా కూడా ప్లాప్  కావడంతో అఖిల్ బాగా డిజప్పాయింట్ అవడం సహజమే. తన తర్వాతి సినిమా విషయంలో స్పీడ్ చూపిస్తా అని చెప్పిన అఖిల్.. జనవరి 10నే మూవీ ప్రకటిస్తానని అన్నాడు. అది వెళ్లిపోయి ఇప్పటికి మూడు వారాలు గడుస్తున్నా.. ఇంకా ఎలాంటి కబురు లేదు. ఇప్పుడు కొరటాల శివ.. సుకుమార్ లతో చర్చలు అంటూ మాటలు వినిపిస్తున్నాయి. హలోకి ముందు కూడా ఇలాగే పెద్ద దర్శకుల కోసం వెయిట్ చేసి.. అవి నచ్చక.. నానా తాత్సారం జరిగింది.

హలో ప్రాజెక్టు ఫైనల్ చేసేందుకే చాలా సమయం పట్టింది. తొలి సినిమా తర్వాత.. రెండో సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు రెండేళ్ల సమయం పట్టిందంటే.. ఎంతగా మీనమేషాలు లెక్కించారో అర్ధమవుతుంది. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేస్తుండడం ఆశ్చర్యకరం. త్వరత్వరగా సినిమాలు చేస్తుంటే.. ఫ్యాన్స్ లో వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఆ సంగతి పట్టించుకోకుండా.. ఇంతేసి సమయం ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ కోసమే తీసుకోవడం మాత్రం అంత సరికాదనే సలహాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు మళ్లీ దర్శకుల పేరుతో నెట్టుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం అక్కినేని అభిమానులను విసిగిస్తోంది. కొత్త కొత్త ఐడియాలతో వస్తున్న నూతన తరం దర్శకులు.. ఆకట్టుకునే సినిమాలు చేస్తున్నారు. వారికి ఓ అవకాశం ఇచ్చి.. లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా చేస్తే.. సక్సెస్ అందుతుంది కదా అంటున్నారు ఫ్యాన్స్. అఖిల్.. హలో మూవీలు డిజాస్టర్స్ అయినా వచ్చిన డబ్బులు ఎక్కువే. బడ్జెట్ లిమిట్ లో ఉంటే.. ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ అయేవి కదా అన్నది వారి వాదన.
Tags:    

Similar News