సచిన్.. అఖిల్.. ఓ బెండకాయ కూర

Update: 2017-12-11 10:35 GMT
చిన్నప్పుడే ‘సిసింద్రీ’గా అలరించిన అక్కినేని అఖిల్.. ఆ తర్వాత వార్తల్లో నిలిచింది తన క్రికెటింగ్ స్కిల్స్ తోనే. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ లో అతడి బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ నైపుణ్యాలు చూసి అందరూ షాకైపోయారు. ఒక ప్రొఫెషనల్ క్రికెట్ లాగా చాలా బాగా ఆడి మెప్పించాడు అఖిల్. టాలీవుడ్ జట్టు విజయాల్లో అతను ఎంతో కీలక పాత్ర పోషించాడప్పుడు. నిజానికి ఒక దశలో అఖిల్ ను సినిమాల్లోకి కాకుండా క్రికెట్లోకి తీసుకెళ్లాలని నాగ్ ప్రయత్నాలు చేసినట్లు.. విదేశాల్లో శిక్షణ ఇప్పించినట్లు కూడా వార్తలొచ్చాయి. అందులో నిజమెంతో కానీ.. తనకు చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే పిచ్చి అన్నది మాత్రం వాస్తవమే అని అఖిల్ చెప్పాడు.

క్రికెట్ అంటే ఎంతిష్టమో.. క్రికెట్ దేవుడు సచిన్ అన్నా కూడా అంతే ఇష్టమని.. ఇంట్లో తన గది నిండా సచిన్ ఫొటోలే ఉంటాయని అఖిల్ తెలిపాడు. తన తో ఏదైనా పని చేయించాలంటే అందుకు సచిన్ పేరునే ఇంట్లో ఉపయోగించుకుంటారని అన్నాడు. తాను ఒకప్పుడు మాంసం ఎక్కువగా తినేవాడనని.. ఆ సమయంలో తన తల్లి అమల.. తనకు ఓ అబద్ధం చెప్పి నాన్-వెజ్ తినడం తగ్గించిందని అఖిల్ వెల్లడించాడు. తనకు బెండకాయ కూర అంటే పడని సమయంలో సచిన్.. మాంసం తినడని.. బెండకాయ కూరే ఎక్కువగా తింటాడని అమల చెప్పిందని.. దీంతో ఆ రోజు నుంచి తాను మాంసం తగ్గించి బెండకాయ కూరే తినడం మొదలుపెట్టానని.. ప్రతి రోజూ ఆ కూర తినేవాడినని.. తన తల్లి అబద్ధం చెప్పిందని తెలుసుకోవడానికి తనకు చాలా కాలం పట్టిందని అఖిల్ వెల్లడించాడు. ఒకప్పుడు తాను క్రికెట్ విషయంలో చూపించిన శ్రద్ధ చూసి తాను క్రికెట్ అయిపోతానని చాలామంది అనుకున్నారని.. కానీ తనకు చిన్నప్పట్నుంచి సినిమాలంటేనే ఎక్కువ ఆసక్తి అని అఖిల్ తెలిపాడు.
Tags:    

Similar News