అనుకున్నదే అయింది. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ రెండో సినిమా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే కన్ఫమ్ అయింది. మొన్నటిదాకా చర్చలు జరుగుతున్నాయ్.. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు అంటూ వచ్చారు కానీ.. ఈ రోజు ఈ కాంబినేషన్లో సినిమాను కన్ఫమ్ చేస్తూ మీడియాకు అధికారిక సమాచారం కూడా అందించారు. వంశీ-అఖిల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కడం అన్నది పాత సంగతే కానీ.. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, పొట్లూరి వరప్రసాద్ సంయుక్తంగా నిర్మించబోతుండటమే తాజా కబురు.
నాగార్జున హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊపిరి’ చిత్రాన్ని నిర్మించింది పీవీపీ సంస్థే అన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా సోలోగా సినిమాలు తీస్తూ వచ్చిన పీవీపీ సంస్థ తొలిసారి.. అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి ఉమ్మడిగా సినిమాను నిర్మించడానికి ముందుకు రావడం విశేషమే. ఐతే ఈ చిత్రం కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్నట్లు ‘యే జవానీ హై దివానీ’ రీమేకా లేకా.. వంశీ ఇంకేదైనా కొత్త కథను ట్రై చేస్తాడా అన్నదే తేలాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో రెండో సినిమా విషయంలో నాగ్, అఖిల్ ఇద్దరూ చాలా జాగ్రత్త పడుతున్నారు.