అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మరో వారసుడు అఖిల్. ఎప్పుడూ ఏ వారసుడికీ లేనంత క్రేజ్ అఖిల్ కి ఉంది. క్రేజ్ మాత్రమే కాదు... ఆకాశాన్నంటే అంచనాలు కూడా ఆయనపై ఉన్నాయి. అఖిల్ ఎంట్రీ ఇస్తున్నాడనగానే సినిమా జనాలు ఫలానా హీరోకి గట్టిపోటీ ఇస్తాడు, ఫలానా హీరోకి ధీటుగా రాణిస్తాడు అని మాట్లాడుకొన్నారు. మరి పోటీ విషయంలో అఖిల్ గురించి ఏ కథానాయకుడు ఎలా భయపడుతున్నాడో తెలియదు కానీ.. అఖిల్ మాత్రం ఈ జనరేషన్ హీరోల్లో నాకు ఎవ్వరూ పోటీ కాదన్నట్టు మాట్లాడుతున్నాడు.
రాబోయే నందమూరి వారసుడు మోక్షజ్ఞనే నాకు పోటీ అని, మాది ఫ్యూచర్ జనరేషన్ అని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అఖిల్ చెప్పిన ఆ మాటలు నిజంగానే సమయస్ఫూర్తితో ఉన్నాయి. పోటీ గురించి అడిగితే ఇప్పుడున్న హీరోల్లో అఖిల్ ఎవ్వరి గురించీ చెప్పే పరిస్థితి లేదు. ఎవరి శైలిలో వాళ్లు సినిమాలు చేసుకొంటూ వెళ్లిపోతున్నారు. పైగా అందరూ అఖిల్ కంటే చాలా సీనియర్లు. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రశ్నకు సమాధానం దాటవేయడమొక్కటే మార్గం. అందుకే సమయస్ఫూర్తితో ఆలోచించి మోక్షజ్ఞ పేరు చెప్పాడు అఖిల్. ఆ రకంగా నందమూరి ఫ్యూచర్ స్టార్ ని ప్రస్తావించడంతో నందమూరి అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. నిజంగానే మోక్షజ్ఞ - అఖిల్ సమ ఉజ్జీలుగా కనిపిస్తారు. మరి వాళ్లయినా ఎన్టీఆర్ - ఏఎన్నార్ లలాగా కలిసిమెలసి నటిస్తారేమో చూడాలి. ఒకవేళ అలా కలిసి నటిస్తే మాత్రం `గుండమ్మకథ`లాంటి సినిమాల్ని బయటికి తీసి రీమేక్ చేయడానికి సిద్ధపడతారు దర్శకనిర్మాతలు.