పండగకు రాని బ్యాచిలర్‌

Update: 2020-09-20 17:30 GMT
అక్కినేని అఖిల్‌ 4వ సినిమా కు సంబంధించి ఒక రొమాంటిక్‌ పోస్టర్‌ విడుదల చేసిన సమయంలో 2021 సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. పోయిన సమ్మర్‌ లోనే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. సినిమా షూటింగ్‌ కూడా పూర్తి కాలేదు. ఎట్టకేలకు మళ్లీ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా షూటింగ్‌ ఇటీవలే పునః ప్రారంభం అయ్యింది. అయ్యింది. అతి త్వరలోనే షూటింగ్‌ మొత్తంను పూర్తి చేయాలని మేకర్స్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే షూటింగ్‌ స్పాట్‌ నుండి అఖిల్‌ ఒక వీడియోను విడుదల చేసి తమ సినిమా విడుదల తేదీ విషయమై చిన్న మార్పు చెప్పాడు.

సంక్రాంతికి విడుదల చేస్తాం అంటూ ప్రకటించిన ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్బంగా కాకుండా పండుగ పూర్తి అయిన వారం రోజుల తర్వాత అంటే వచ్చే ఏడాది జనవరి 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. సంక్రాంతికి ఇంకా పెద్ద సినిమాలు ఏమీ కూడా అధికారికంగా కన్ఫర్మ్‌ అవ్వలేదు. అయినా కూడా పండుగ బరిలో నిలిలచేందుకు అఖిల్‌ మాత్రం ఆసక్తిగా చూపడం లేదని ఈ ప్రకటనతో అర్థం అవుతుంది.

సంక్రాంతి వరకు థియేటర్ల పరిస్థితి నార్మల్‌ అవుతుందా లేదా అనే మిమాంశతో చాలా మంది మేకర్స్‌ విడుదల విషయంలో వెనకడుగు వేస్తున్నారు. కాని అఖిల్‌ మూవీ బ్యాచిలర్‌ మేకర్స్‌ మాత్రం సినిమాను తేదీతో సహా ప్రకటించడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఈమద్య కాలంలో విడుదల తేదీని ప్రకటించిన పెద్ద సినిమా అంటే మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ అనడంలో సందేహం లేదు.

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో అఖిల్‌ కు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబో సీన్స్‌ తెరకెక్కతున్నాయి. వచ్చే నెల చివరి వరకు షూటింగ్‌ దాదాపుగా పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News