మీడియాకు అమల ఓపెన్ లెటర్

Update: 2018-03-01 12:08 GMT
శ్రీదేవి మరణం ఎంతో మందిని బాధలో ముంచేసింది. తెరపై చూసిన ప్రేక్షకులే తేరుకోలేక పోతే.. ఆమెతో మంచి పరిచయాలున్న సినీతారలు... మరింత కుంగిపోతారు.  ఇలాంటి పరిస్థితిలో హూందాగా ప్రవర్తించాల్సిన టీవీ మీడియా ఏం చేసింది? టీఆర్పీల కోసం... చాలా నీచంగా ప్రవర్తించింది.

 శ్రీదేవి బాత్ టబ్లో మునిగి చనిపోయిన ఘటన గురించి... చెబుతూ... యాంకర్లు - రిపోర్టర్లు కూడా బాత్ టబ్లో దిగారు. ఒక ఛానెల్ రిపోర్టర్ మరి అతిగా... బాత్ టబ్లో పడుకుని మరీ రిపోర్టింగ్ చేశాడు. మరొక టాప్ ఛానెల్... బాత్ టబ్లో శ్రీదేవి పడిపోయి... రక్తమోడుతున్నట్టు ఫోటోలు గ్రాఫిక్స్ చేసి పెట్టారు. ఇవన్నీ సామాన్యులకే కాదు... సినీతారలకు కూడా చిరాకు తెప్పించింది. అందులోనూ సున్నిత మనస్కురాలైన అమలకు మరింతగా కోపాన్ని తెప్పిచింది. అందుకే ఆమె మీడియాకు ఓపెన్ లెటర్ రాసింది.  ఎంతో భావోద్వేగానికి లోనై రాసిన లెటర్ ను ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసింది.

ఆమె రాసిన ఉత్తరం ద్వారా... ఒక నటి కూడా మనిషేనని.. ఆమెను తన జీవితాన్ని ఆస్వాదించనీయండనీ ఆమె కోరినట్టుగా ఉంది. ఆమె రాసిన ఉత్తరం ప్రకారం.... పెరుగుతున్న వయసును ఆనందంగా నన్ను స్వీకరించనిస్తారా? అని ప్రారంభమైంది. తాను ఎంత బరువు పెరిగానో... నా ముఖం ఎంత అలసటగా కనిపిస్తోందో కామెంట్లు చేయకుండా నా జీవితాన్ని నన్ను ఆస్వాదించనిస్తారా? అని మీడియాను ప్రశ్నించింది. ఇప్పటి నా పొట్టి జుట్టును... 19 ఏళ్ల నాటి పొడవు జుట్టుతో పోల్చకుండా... నా జుట్టు కు నల్లరంగు వేసుకునే అవసరం లేకుండా చేస్తారా? వ్యక్తి బాహ్య శరీరాన్నే కాదు... మనస్సు ను కూడా అర్థం చేసుకోగల శక్తి కెమెరాలకు ఉంది.. అని చెప్పింది అమల

పుకార్ల గురించి ప్రస్తావించకుండా... పరువు ప్రతిష్ట... కీర్తి అనే పంజరాలలోనే ఉండిపోనీయకుండా... నాకు విముక్తి కల్పించగలరా? నా వ్యక్తిగత జీవితాన్ని... స్వేచ్ఛను నాకు ఇవ్వండి... నిజాయితీగా... పరులకు పరోపకారిగా.... బతికే అవకాశాన్ని... స్వేచ్ఛను నాకివ్వండి.. అంటూ విన్నవించుకుంది.
Tags:    

Similar News