నాగార్జున-బన్ని, అఖిల్-వరుణ్‌తేజ్, చరణ్- చైతూ .. ఈ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌లు తెరకెక్కితే ఎలా ఉంటుంది? ఐడియా బావుంది కదూ! నిజంగానే అటు మెగాభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు పండగ చేసుకోవడానికి ఆస్కారం ఉన్న ఐడియా ఇది. పైగా ఇరు కుటుంబాల మధ్య బోలెడంత సాన్నిహిత్యం ఉంది.
ఏఎన్నార్ అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని గౌరవం. అంతటి దిగ్గజంతో కలిసి 'మెకానిక్ అల్లుడు' లాంటి సినిమాలో నటించడం ఎంతో గౌరవం అని మెగాస్టార్ చెప్పేవారు. కాలక్రమంలో ఈ సాన్నిహిత్యం ఏమైందో.. చిరు, బాలయ్య, నాగార్జున, వెంకీ టైమ్‌లో అస్సలు మల్టీస్టారర్లే రాలేదు. ఆ రోజుల్లో ఎలాంటి ఈగోలు లేకుండ ఏఎన్నార్, ఎన్టీఆర్‌లే కలిసి నటించారు. కానీ తర్వాతి కాలంలో చిరు, బాలయ్య పీక్స్‌లో ఉన్నప్పుడు ఊహించని ఫ్యాన్స్ ఫీవర్ రాజుకుని ఈగో సమస్యలు తలెత్తడంతో కలిసి నటించడం వీలుపడలేదు.
అయితే ఇప్పుడు మళ్లీ సీన్ మారింది. అభిమానుల ఆలోచనల్లోనూ మార్పులొచ్చాయి. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవుతున్నారు కాబట్టి ఇటీవలి కాలంలో మహేష్- వెంకీ, రామ్ - వెంకీ, చరణ్ - బన్ని .. ఇలా కాంబినేషన్లు సెట్ చేసి సినమాలు తీశారు. సక్సెసయ్యారు. అందుకే నాగ్-బన్ని, అఖిల్ -వరుణ్‌తేజ్, చరణ్- చైతూ కలిసి నటించే సినిమాలు రావాలని కోరుకున్నది. దీనివల్ల సినిమాల మార్కెట్ రేంజు కూడా పెరుగుతుంది.