నిప్పుల కొలిమిలో మండే క‌ణంలా బాల‌య్య‌!

తాజాగా 'డాకు మ‌హారాజ్' కోసం బాల‌య్య ఎంత‌గా శ్ర‌మించారు? అన్న‌ది ద‌ర్శ‌కుడు బాబి చెప్పింది తెలిస్తే ఆయ‌న ఎంత క‌మిట్ మెంట్ ఉన్న హీరో అన్న‌ది మ‌రోసారి అర్ద‌మ‌వుతుంది.

Update: 2025-01-12 06:43 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ ద‌ర్శ‌కుల హీరో అని చెప్పాల్సిన ప‌నిలేదు. సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత ఆయ‌న పూర్తిగా ద‌ర్శ‌కుల్లో చేతుల్లోకి వెళ్లిపోతారు. ద‌ర్శ‌కుల విజ‌న్ వేలు పెట్ట‌డం...క్రియేటివ్ గా అలా ఉండాలి..ఇలా ఉండాలి అనే ఉచిత స‌లహాలు ఇవ్వ‌రు. సెట్ లో ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోతారు. తాను ద‌ర్శకుల హీరోన‌ని ఎన్నోసార్లు ఆయ‌నే స్వ‌యంగా చెప్పిన సంద‌ర్భాలున్నాయి. అందుకే వ‌రుస‌గా విజ‌యాలు ఖాతాలో న‌మెద వుతున్నాయి.

తాజాగా 'డాకు మ‌హారాజ్' కోసం బాల‌య్య ఎంత‌గా శ్ర‌మించారు? అన్న‌ది ద‌ర్శ‌కుడు బాబి చెప్పింది తెలిస్తే ఆయ‌న ఎంత క‌మిట్ మెంట్ ఉన్న హీరో అన్న‌ది మ‌రోసారి అర్ద‌మ‌వుతుంది. సినిమాలో డూప్ లేకుండా యాక్ష‌న్ స‌న్నివే శాలు చేసిన‌ట్లు బాబి ఇప్ప‌టికే రివీల్ చేసాడు. అయితే అంత‌కు మించిన రియ‌ల్ స్టిక్ సీన్ ఒక‌టి చేసార‌న్నారు. అదేంటో ఆయ‌న మాటల్లోనే... 'రాజ‌స్థాన‌లో షూటింగ్ చేస్తున్నాం. అస‌లే మండే ఎండ‌.

అక్క‌డ కాలుతోన్న క‌ట్టెల్ని ప‌ట్టుకున్న వ్య‌క్తుల మ‌ధ్య ఓ స‌న్నివేశం చేసాం. షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌ధ్య‌లో ఏదో చెప్ప‌డానికి మానిట‌ర్ ద‌గ్గ‌ర నుంచి వెళితే ఆ సెగ‌కు అక్క‌డ ఉండ‌లేక‌పోయా. కానీ బాల‌కృష్ణ గారు మాత్రం అక్క‌డే ఉంటూ క‌ళ్లు తెర‌చుకుని న‌టిస్తూ ఆ స‌న్నివేశం పూర్తి చేసారు. ఆస‌మ‌యంలో ఎంతో టెంప‌రేచ‌ర్ ఉంది. అలాంటి ప‌రిస్థితుల్లో రెప్ప తెర‌వ‌డం అంటేనే క‌ష్టం. అలాంటిది ఆయ‌న క‌ళ్ల‌లోనే అగ్నిని చూపించారు.

అదే ఆయ‌న గొప్ప‌త‌నం. న‌ట‌న అంటే ఆయ‌న అంత‌గా ప్రేమిస్తారు. అలాగే ఓమొండి గుర్రాన్ని కూడా అదుపు చేస్తూ డూపు లేకుండా న‌టించారు. నేను క్ర‌మ శిక్ష‌ణ‌తోనే ఉంటాను. ఈసినిమాలో బాల‌కృష్ణ గారిని చూసాక అది మ‌రింత ఎక్కువ‌గా అల‌వాటు చేసుకున్నాను' అని అన్నారు. అదీ న‌ట‌సింహం అంటే. ఇక బోయ‌పాటి తెర‌కెక్కిస్తోన్న 'అఖండ తావ‌డం'లో బాల‌య్య శివ తాండవం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహ‌కే అంద‌దు.

Tags:    

Similar News