అక్కినేని హీరో నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటూ దూసుకెళుతున్నాడు. మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 'బంగార్రాజు'తో మెప్పించాడు. ఈ మూవీలో కింగ్ నాగార్జున కూడా ప్రధాన పాత్రలో నటించారు. బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సాయి పల్లవి తో కలసి నటించిన 'లవ్ స్టోరీ' మరో బ్లాక్ బస్టర్ హిట్. వరుస హిట్లతో అతడు ఇంకా దూకుడు పెంచాడు.
ప్రస్తుతం విక్రమ్ కె తెరకెక్కించిన థాంక్యూ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు చై. జూలై 22న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్.. పాటలు ప్రేక్షకుల దృష్టిని ఆశించినంతగా ఆకట్టుకోలేదు. అయితే విక్రమ్ కె ప్రతిభ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అతడు మనం- 24 లాంటి వైవిధ్యమైన చిత్రాలతో తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చైతో కూడా మ్యాజిక్ చేస్తాడనే ఆశిస్తున్నారు.
చై ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. మీడియాలో ఓ ప్రశ్నకు సమాధానంగా నాగచైతన్య ఆకట్టుకునే రిప్లై ఇచ్చారు. ప్రేక్షకులను పదే పదే థియేటర్లకు రప్పించాలంటే హీరోల పద్ధతి మారాలని కూడా అతడు హింట్ ఇచ్చారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే థ్రిల్లింగ్ ఎలిమింట్స్ తో సినిమాలు తీయాలి.
కంటెంటే ఇక్కడ కింగ్. దానితో మెప్పించాలి. అలాగే టెక్నిక్ పరంగా సినీ నిర్మాణంలో అనేక మార్పులు తీసుకురావాలి. అప్పుడే నిర్మాత బతికి బయటపడుతాడు. పారితోషికాలు కాకుండా లాభాల్లో షేర్ తీసుకోవాలి. హీరోలు దర్శకులు నిర్మాతలు బలమైన ప్లానింగ్ చేస్తేనే ఇది సాధ్యం అని కూడా అన్నారు. ఒక ప్రముఖ నిర్మాత కం నటుడి వారసుడిగా చైతన్య ఎంతో పరిపక్వతతో మాట్లాడారు.
వ్యక్తిగత ప్రశ్నలు వద్దు!తాజా ఇంటరాక్షన్స్ లో వ్యక్తిగత ప్రశ్నలు అడగకూడదని మీడియాకి కఠినమైన ఆదేశాన్ని జారీ చేసాడని గుసగుసలు వినిపించాయి. సమంతతో బ్రేకప్..శోభితా ధూళిపాళతో తన రిలేషన్ షిప్ గురించి చర్చ సాగుతుండగా దీనిపైనా వీటిపై మాట దాట వేసారని గుసగుస వినిపిస్తోంది.
సమంత రూత్ ప్రభుతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య నటించిన మొదటి సినిమా లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ప్రమోషన్ల సమయంలో చై వ్యక్తిగత ప్రశ్నలు అడగవద్దని అన్నారు. ఇప్పుడు థాంక్యూ ప్రమోట్ చేస్తున్నప్పుడు అదే విషయాన్ని మీడియాని అడిగాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన థాంక్యూ చిత్రంలో చై సరసన రాశి ఖన్నా- మాళవిక నాయర్ - అవికా గోర్ నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.
థాంక్యూ కాకుండా లాల్ సింగ్ చద్దా -వెంకట్ ప్రభు దర్శకత్వంలో చై నటించనున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ 'దూత'తో నాగచైతన్య తన డిజిటల్ రంగ ప్రవేశం చేయనున్నాడు.