నందిత శ్వేత కీలక పాత్రలో నటించిన అక్షర సినిమా వారం రోజుల క్రితమే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మిశ్రమ స్పందన వచ్చిన ఈ సినిమా కు కలెక్షన్స్ నిరాశ పర్చాయి. పోటీగా పలు సినిమాలు ఉన్న కారణంగా టాక్ తో సంబంధం లేకుండా నిల్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. దాంతో వారం గ్యాప్ లోనే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు ఉంచారు. సహజంగా అయితే సినిమా ను థియేటర్లలో విడుదల చేసిన తర్వాత కనీసం నెల రోజుల నుండి 50 రోజుల గ్యాప్ తీసుకున్న తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం చేసుకుంటూ ఉంటారు. కాని ఈ సినిమా విషయంలో అలాంటిది ఏమీ జరగనట్లుగా ఉంది. అందుకే వారం రోజుల్లోనే ప్రైమ్ లో వచ్చేస్తోంది.
థియేటర్ల వరకు వెళ్లని వారు చాలా మంది అక్షర సినిమాను ప్రైమ్ లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్ లైన్ లో ట్రైలర్ చూసి సినిమా పై అంచనాలు పెట్టుకున్న వారు థియేటర్ కు వెళ్లని వారు ఇప్పుడు ప్రైమ్ లో వచ్చింది అనగానే భారీగానే చూసినట్లుగా తెలుస్తోంది. అక్షర సినిమా కు ఓటీటీ లో కాస్త గౌరవ ప్రథమైన వ్యూస్ వస్తున్నట్లుగ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమా లు వెంటనే ఇలా ఓటీటీలో వస్తే ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి డబ్బులు దండగ పెట్టుకోవడం ఎందుకు ఒకటి రెండు వారాలు వెయిట్ చేసి ఓటీటీలో చూద్దాం అనుకునే వారు చాలా మంది ఉంటారు. కనుక ముందు ముందు ఇలా విడుదలైన వెంటనే ఓటీటీల్లో విడుదల చేయక పోవడం మంచిది.