క‌ర‌ణ్ టాక్ షోలో అక్ష‌య్ తో స‌మంత ఊ అంటావా!

Update: 2022-07-20 11:38 GMT
స‌మంత- అక్ష‌య్ కుమార్  ఎంట్రీ తో కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7 ఒక్క సారిగా హీటెక్కింది. నిన్న‌టి రోజున రిలీజ్ అయిన ప్రోమోలో  అక్ష‌య్-స‌మంత‌ని ఎత్తుకుని తీసుకుని సీటు లోకూర్చోబెట్ట‌డం..క‌ర‌ణ్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మంత స‌మాధానాలు చెప్పిన స‌న్నివేశం నెట్టింట జోరుగా వైర‌ల్ అయింది. ఒక్క ప్రోమోని టాలీవుడ్ ని ఒక్కసారిగా వేడెక్కించింది.

ఇక ఫుల్ షో లో ఇంకెంత ఉంటుందో? అన్న ఉత్సాహం మొద‌లైంది.  స్ర్టీమింగ్ అవ్వ‌డానికి ఇంకా కొన్ని గంట‌లు స‌మ‌య‌మే ఉండ‌టంతో మ‌రోప్రోమోతో హీటెక్కించే  ప్ర‌య‌త్నం చేసారు.

ఈసారి ఏకంగా 'ఊ అంటావా మావ‌..ఊఊ అంటావా మావ' ఐటం నెంబ‌ర్ కి సమంత తో క‌లిసి అక్ష‌య్ కుమార్ కూడా స్టెప్పులేసాడు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మాస్ మ‌సాలా సాంగ్ ని అద్భుతంగా రీక్రియేట్ చేసారు.

స‌మంత హుక్ స్టెప్ ని అక్ష‌య్ దించేసాడు. ఎక్స్ ప్రెష‌న్స్ ఎంతో చ‌క్క‌గా క్యారీ చేసాడు. ప్ర‌స్తుతం ఆ ప్రోమ్  అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇక ఈ పాట  సోష‌ల్ మీడియాలో సృష్టించిన సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన  ప‌నిలేదు.  కోట్లాది మంది ఈ పాట‌ని వీక్షించారు. ఇప్ప‌టికీ ట్రెండింగ్ లో ఉంది. అందుకే ఈ పాట‌ని క‌ర‌ణ్ టాక్ షోని  ఎలివేట్ చేసేలా ప్రోమోలో వ‌దిలారు.

హిందీలో కూడా పాట ఉన్న‌ప్ప‌టికీ  మాతృక వెర్ష‌న్నే ప్ర‌చారం కోసం వినియోగించిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి క‌ర‌ణ్ టాక్ షో కోసం  అభిమాన‌లంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూసేలా ఓ బ‌జ్ ని తీసుకొచ్చారు.

మూడు ప్రోమోల‌తోనే ఈ రేంజ్ లో ఓ ఊపు తీసుకొచ్చారు. మ‌రి షోలో అస‌లు మ్యాట‌ర్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. ఈ సీజన్ 7   ఎపిసోడ్ గురువారం రాత్రి 7 గంటలకు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రదర్శించబడుతుంది. అంత‌వ‌ర‌కూ ఎగ్జైట్ మెంట్ త‌ప్ప‌దు. ఆ ర‌కంగా స‌మంత బాలీవుడ్ లో సినిమాలు చేయ‌డానికి ముందే తెగ ఫేమ‌స్ అయిపోతంది.

Video Here >> https://youtube.com/shorts/rjcHuwlYz94?feature=share
Tags:    

Similar News