బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ దేశంలోనే ఏ హీరో చేయనంత గొప్ప విరాళాలు ఇస్తూ దేశంయావత్తు ఆయనకు సెల్యూట్ చేసేలా చేస్తున్నాడు. కరోనా వ్యాప్తిలో నేను సైతం అంటూ ఏ హీరో చేయనంత విరాళాన్ని చేస్తున్నాడు.
ఇప్పటికే కరోనాపై ఫైట్ కోసం ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన 'పీఎం కేర్' విరాళానికి ఏకంగా అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
తాజాగా కరోనాపై పోరాడుతున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్ కార్మికు ఆరోగ్యం కోసం పీపీఈ కిట్స్ కోసం ఈ డబ్బును అందజేశాడు. ఈ విషయాన్ని భారత సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్ష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
కరోనాపై పోరాడుతున్న వారికి అక్షయ్ కుమార్ కూడా ధన్యవాదాలు తెలిపాడు. పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఆర్మీ అదికారులు - వలంటీర్లు తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.
కరోనాపై ఫైట్ కోసం అక్షయ్ కుమార్ చేస్తున్న గొప్ప సహాయానికి అభిమానులు, ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.