రేపిస్ట్ కు సహకరించడంపై విచారణకు అగ్రహీరో..

Update: 2018-11-12 13:05 GMT
బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. 2015-16లో పంజాబ్ లో జరిగిన కొన్ని అసాంఘిక సంఘటనల కేసుల్లో ఇరుకున్న వాటిపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. తాజాగా ఈ కేసు విషయంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను సిట్ కు ఈ కేసుని అప్పగించింది. ఈ కేసులో ప్రమేయమున్న పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ సహా అక్షయ్ కుమార్ లు కూడా విచారణకు హాజరు కావాల్సి వస్తోంది.

పంజాబ్ లో 2015లో ఫరీద్ జిల్లాలో కొన్ని అపవిత్ర సంఘటనలు జరిగాయి. ఇందులో ప్రమేయమున్న అక్షయ్ కుమార్ - ప్రకాష్ సింగ్ బాదల్  - ఆయన కొడుకు సుఖ్ బీర్ లపై కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగానే అక్షయ్ కుమార్ ను నవంబర్ 21న అమృత్ సర్ లో విచారణకు హాజరు కావాలని సిట్ కోరింది.

మోసాలు హత్యలు చేయించి జైలు శిక్ష అనుభవించిన డేరాబాబుకు - నాటి సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కు మధ్యన అక్షయ్ కుమార్ మధ్యవర్తిత్వం వహించాడనే ఆరోపణలున్నాయి. ఆ కేసులోనే తాజాగా విచారణ ఎదుర్కొంటూ అక్షయ్ కుమార్ చిక్కుల్లో పడ్డాడు.
Tags:    

Similar News