2.0: అప్సెట్ అయిన అక్షయ్ ఫ్యాన్స్?

Update: 2018-09-13 16:55 GMT
అతి ఎప్పుడూ అనర్థదాయకం.  ఓవర్ ప్రమోషన్స్.. విపరీతమైన హైప్.. బడ్జెట్ 540 కోట్ల పై మాటే.  ఇవన్నీ విన్న ప్రేక్షకుడికి 'అవతార్' కంటే తక్కువ రేంజ్ ప్రోడక్ట్ కనుక ఇస్తే ఒక్క సెకండ్ లో డిజప్పాయింట్ అవుతాడు.  '2.0' టీజర్ పరిస్థితి ఇలాగే ఉంది.  కాకి పిల్ల కాకికి ముద్దు సామెతకు తగ్గట్టే సౌత్ జనాలకు నచ్చిన ట్రైలర్ హిందీ జనాలకు పెద్దగా రుచించలేదు.  అసలు తెల్లగా ఉండే అక్షయ్ ని కాకిలా చూపించడం ఒక అభిమానికి నచ్చలేదు. "సాలా అక్షయ్ కొ కాలా కౌవా బనాయా?" అంటూ ఫైర్ అయ్యాడు..మరి అభిమానుల అభిమానం అలానే ఉంటుంది.

ఇక ఈ భారీ అంచనాల ను సినిమా టీజర్ రీచ్ అయిందా అంటే.. టీజర్ సూపర్ కానీ మెజారిటీ జనాలు 'అంతకు మంచి'న అవతార్ ను ఆశించారు! సరిగ్గా అక్కడే టీజర్ విషయంలో శంకర్ కాస్త తడబడ్డాడు.  పైగా హిందీ వాళ్ళ మేజర్ కంప్లైంట్ ఏంటంటే "అక్షయ్ కుమార్ ను టీజర్ లో సరిగా ఒక సెకండ్ కూడా చూపించరా? హిందీ మార్కెట్ అవసరం లేదా? దానికి ఎవరు ఏమని సమాధానం చెప్తారు. సూపర్ స్టార్ రజనీ సినిమాలో అయన యాంటి హీరో.  అలాంటప్పుడు హీరోకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎన్ని చెప్పుకున్నా అక్షయ్ కుమార్ కంటే రజనీ పెద్ద స్టార్.   

కానీ అభిమానులు అవన్నీ వినరుకదా. వారు హిందీ ప్రేక్షకులకోసం అక్షయ్ కుమార్ సీన్స్ ఉండే టీజర్ ను రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ఇది ఎప్పుడో లీకయిన టీజర్ కదా.. కొత్తేముంది అని పెదవి విరుస్తున్నారు!

ఈ ఎమోషన్స్ అన్నీ సరే గానీ.. సినిమా రిలీజ్ కాకుండా అక్షయ్ కుమార్ కు సినిమాలో ఇచ్చిన ప్రయారిటీ గురించి మనం మాట్లాడలేం. మరోవైపు టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ తప్ప అసలు కొత్తదనం ఏముందని కూడా కొందరు అంటున్నారు.   మరి శంకర్ & టీమ్ తమ ఐదొందలా యాభై కోట్ల బడ్జెట్ ను రికవరీ చేసుకోవాలంటే బాలీవుడ్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్.  మరి దానికోసం ఎలాంటి స్ట్రేటజీతో ముందుకొస్తారో వేచి చూడాలి. 
Tags:    

Similar News