వినాయక చవితి పండుగకు పెద్దోళ్ల హంగామా సంగతేమో కానీ.. బుల్లి బుల్లి చేతులతో పూజా పునస్కారాలు చేసే చిన్నోళ్లదే అసలు హంగామా అంతా. తమ పుస్తకాలను గణేషుడి దగ్గర ఉంచి.. వాటిలో పసుపుతో ఓం.. శ్రీ.. అంటూ అక్షరాలు రాసేసుకుని.. తమకు చదువు బాగా వచ్చేలా చేయమని కోరుకుంటారు. అలాగే పండక్కి చుట్టాల ఇళ్లకు వెళుతూ స్వీటు-హాటు పట్టుకెళ్లడం కూడా ఆనవాయితీగా వస్తోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ ఈ స్వీట్స్ దగ్గరే ఓ వినూత్నమైన ఆలోచన చేశాడు. 'పండుగ రోజున ఇతరుల ఇళ్లకు దేవుడి దర్శనానికి వెళ్లేటపుడు స్పీట్స్ లాంటి వాటికి బదులుగా.. నోట్ బుక్స్ తీసుకెళ్తే.. వాటిని తర్వాత మున్సిపల్స్ స్కూల్స్ లో డొనేట్ చేయచ్చు కదా' అంటున్నాడు అక్షయ్ కుమార్. నిశితంగా పరిశీలిస్తే బాలీవుడ్ ఖిలాడీ చెప్పిన మాట ఎంతో ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది.
పండక్కి ప్రతీ ఇంటా పిండివంటలు చేసుకుంటారు కదా.. మరి మళ్లీ డబ్బులు ఖర్చు చేసి స్వీట్స్ కొనుక్కుని వెళ్లే బదులు.. అందుకు ప్రతిగా పుస్తకాలను డొనేట్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయడం మంచి పని. చదువుకుందామని అనుకున్నా చదువుకు దూరమవుతున్న ఎంతో మందికి మేలు చేసే ఆలోచనగా చెప్పచ్చు. మరి అక్షయ్ కుమార్ ఆలోచనను అమలు చేసేందుకు ప్రయత్నిద్దామా!!