సూపర్ స్టార్ రజనీకాంత్ - అక్షయ్ కుమార్ - శంకర్ కాంబినేషన్ మూవీ 2.ఓ ఈనెల 29న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 600కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని 2.ఓ ట్రైలర్ వేదికపై రజనీ ప్రకటించారు. అంత భారీ బడ్జెట్ ఎందుకు ఖర్చయిందో మేకింగ్ విజువల్స్ పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇప్పటికే 2.ఓ చిత్రంలో రజనీ చిట్టీ పాత్ర మేకింగ్ సహా చిత్రంలోని పలు పాత్రల్ని ఎలా డిజైన్ చేశారన్నది ఆవిష్కరిస్తూ వీడియోల్ని లాంచ్ చేశారు. ఈ వీడియోల్లో టెక్నాలజీ పరంగా ఏ స్థాయిలో శ్రమించారు అన్నది అర్థమవుతోంది.
ఈ చిత్రంలో అక్షయ్ క్రోమ్యాన్ పాత్ర ఎంతో ఇంపార్టెంట్. పశుపక్షాదులకు మనసుంటుందని - వాటికీ కోపం వస్తే ప్రపంచ వినాశనమేనని హెచ్చరించే పాత్ర ఇది. మితిమీరిన సాంకేతికత క్రోమ్యాన్ ని భీకరమైన విలన్ గా మార్చేస్తుంది. సెల్ ఫోన్ సిగ్నల్ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరిస్తూ గొప్ప సందేశాన్ని ఈ పాత్ర ద్వారా ఇస్తున్నారు శంకర్. అందుకే త్వరలో వస్తున్నాడు క్రోమ్యాన్. భూమ్మీద విద్వంసం సృష్టించేందుకు అంటూ ఇప్పటికే ట్రైలర్ లో చూపించారు.
దుర్మార్గపు ప్రపంచంపై దాడి చేసేందుకు శంకర్ ప్రయోగిస్తున్న పక్షి రాజు ఈయన. చేతిలో సెల్ ఫోన్ లాక్కుని విద్వంసం సృష్టించడం తన పని. ఈ పాత్ర మేకప్ కోసం రోజూ 5 గంటలు శ్రమించానని 3గంటల పాటు మేకప్ వేస్తే - అది తొలగించేందుకు 2గంటలు పట్టేదని అక్షయ్ ఇదివరకూ వెల్లడించారు. ఆ సంగతిని తాజాగా రివీల్ చేసిన క్రోమ్యాన్ మేకింగ్ వీడియో చెబుతోంది. 28 ఏళ్లలో ఇలాంటి శ్రమ చూడలేదని అక్షయ్ ఎందుకన్నారో ఈ వీడియో చెబుతోంది. రజనీ పాత్రను మించి క్రోమ్యాన్ గెటప్ కోసం శ్రమించిన తీరు కనిపిస్తోంది. ప్రాస్థటిక్స్ మేకప్ పనితనం మైమరిపిస్తోంది. ఇంతకీ క్రోమ్యాన్ ని ఢీకొట్టేది ఎవరు? అంటే చిట్టీ ద రోబోట్ 2.ఓ రీలోడెడ్. ఆ ఇద్దరి మధ్యా పోరు ఎలా ఉండనుందో వేచి చూడాలి.
Full View