న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా బెంగళూరులో జరిగిన అరాచకం అందరినీ కదిలిస్తోంది. సెలబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అయితే.. ఈ దృశ్యాలు చూసి చలించిపోయానని అంటున్నాడు. ఇక ఉండబట్టలేక దుర్మార్గులకు క్లాస్ పీకడమే కాదు.. అమ్మాయిలకు కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు.
'ఓ మాట డైరెక్టుగా చెప్పనా.. ఇవాళ నేను మనిషిగా ఎందుకు పుట్టానా అనిపిస్తోంది. ఫ్యామిలీతో కలిసి కేప్ టౌన్ నుంచి తిరిగివచ్చాను. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని సరదాగా సంతోషంగా ఇంటికి వచ్చాక.. టీవీల్లో న్యూస్ చూశాను. బెంగళూరు న్యూ ఇయర్ వేడుకల్లో జరిగినది చూస్తుంటే.. మీకెలా ఉందో కానీ నా రక్తం మరిగి పోయింది. నేను ఓ అమ్మాయికి తండ్రిని. కాకపోయినా సరే ఇదే మాట్లాడతా. సమాజం మన మహిళలకు గౌరవం ఇవ్వలేకపోతోంది. అలాంటప్పుడు సమాజం అనే హక్కు కూడా మనకు ఉండదు' అన్నాడు అక్షయ్.
'ఇలాంటి వాళ్లంతా వేధింపులకు గురించి సమర్ధించుకోవడానికి కూడా కారణాలు చెబుతారు.. ఎదురు ప్రశ్నలు వేస్తారు. అమ్మాయిల ఎందుకు చిన్న బట్టలు వేసుకుంటారు .. అర్ధరాత్రి అమ్మాయి బయటకెందుకు వెళ్లాలి.. ఇలా మాట్లాడ్డానికి సిగ్గుండాలి.. వాళ్ల బట్టలు కాదు.. మీ ఆలోచనలు చిన్నవిగా ఉన్నాయి. ఇలా ఛండాలమైన పనులు చేసేవాళ్లు వేరే గ్రహం నుంచి రాలేదు. వీళ్లంతా మన మధ్యలోనే ఉన్నారు. మనలాంటి ఇళ్లలోనే ఉంటూ.. మనతోనే తిరుగుతూనే ఉంటారు' అన్నాడు అక్షయ్ కుమార్.
'అమ్మాయిలకు కూడా ఓ మాట చెబ్దామని అనుకుంటున్నా. అబ్బాయిల కంటే మీరు బలహీనులు అని ఎప్పుడూ అనుకోకండి.. మీ రక్షణ కోసం మీరు అన్ని రకాలుగా తయారవచ్చు. మార్షల్ ఆర్ట్స్ లో ఇలాంటి వాళ్లను కంట్రోల్ చేయడానికి చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. మిమ్మల్ని మీరే రక్షించుకోగలరని తెలుసుకోంది. భయపడద్దు.. మీరెవరి కంటే తక్కువ కాదు.. కొంచెం అలర్ట్ గా ఉండడి. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి' అంటూ బెంగళూరు ఘటనపై స్పందించాడు అక్షయ్ కుమార్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/