వాళ్లందరికీ ఇన్సూరెన్స్ చేయిస్తున్నాడు

Update: 2017-04-26 08:18 GMT
మన సినిమాలు ఎక్కువ గా యాక్షన్ తో ముడిపడి ఉన్న కథ లు ఉంటాయ్. మన హీరోలు అందరూ చాలవరకు యాక్షన్ హీరోలే. యాక్షన్ తోనే జనాలకి దగ్గర ఆయినవారు లేకపోలేదు. హిందిలో అలాంటి పేరున్న ఒక టాప్ హీరో అక్షయ్‌కుమార్‌. అక్షయ్‌కుమార్‌ హీరో గా రాకముందే అతనికి యాక్షన్ అన్నా.. స్టంట్స్ అన్నా చాలా ఇష్టం. పైగా అతను కూడా కరాటే లో శిక్షణ పొందినవాడు కావడంతో స్టంట్స్ తో ఇంకా దగ్గర అనుభందం ఉంది. స్టంట్స్ కి అస్సిస్ట్ చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే చాలా ఏళ్ళు నుండి స్టంట్స్ మెన్ కోసం పాటుపడుతున్నాడు.

తాజాగా ఈ స్టంట్ మెన్ కోసం.. ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తున్నాడు.యాక్షన్ సీన్ జరిగినప్పుడు వాలికి ఏమైనా జరిగితే వాళ్ళ కుటంబం రోడ్డున పడుతుంది కాబట్టి అలాంటి వారి జీవితాలు కోసం అక్షయ్‌ ప్రముఖ కార్డిలయాజిస్ట్‌ డాక్టర్‌ రామకృష్ణ పాండాతో కలిసి బాలీవుడ్‌ లో ఉన్న స్టంట్‌ మెన్లందరికీ ఇన్సూరెన్స్‌ చేయిస్తున్నాడు. ప్రతీ స్టంట్‌ మెన్‌ కి  ప్రమాదంలో గాయపడితే రూ. 6లక్షలు.. మరణిస్తే రూ 10 లక్షలు లబ్ధి పొందేలా ఇన్సూరెన్స్‌ అందిస్తున్నారు. సినిమాలో జరిగే యాక్షన్ లో వీళ్ళ సహకారం మరవలేనిది అని చెప్పుతూ.. వీళ్ళకి కూడా అవార్డ్ ఒకటి పెట్టాలి అని  వారిని మనం తగిన రీతి లో గౌరవం ఇవ్వాలి అని చెప్పాడు.

వాటే వండర్ ఫుల్ డెడికేషన్ అక్షయ్. నిజంగానే తెలుగు హీరోలు కూడా తమ కోసం స్టంట్లు చేసే ఈ ఫైటర్ల గురించి ఆలోచిస్తే బెటర్ బాసూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News