బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న నటులలో ఒకరిగా రికార్డులోకెక్కాడు. వరల్డ్ ఫేమస్ ఫోర్బ్స్-2020 విడుదల చేసిన టాప్ 10 జాబితాలో అక్షయ్ 6వ స్థానం సంపాదించుకున్నాడు. మంగళవారం ఫోర్బ్స్-2020 జాబితా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి అధికంగా సంపాదిస్తున్న నటులలో హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. డ్వెన్ జాన్సన్ ఇండియాలో కూడా టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడే. గతంలో రిజ్లింగ్ క్రీడాకారుడిగా.. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ "ది రాక్" గా అందరికి తెలుసు. అయితే డ్వెన్ ఫోర్బ్స్ జాబితాలో ప్రథమ స్థానంలో నిలవడం రెండోసారి. ఇక ఫస్ట్ స్థానంలో నిలిచిన డ్వెన్ జాన్సన్ 2019 జూన్ నుంచి 2020 జూన్ వరకు 87.5 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 654 కోట్ల రూపాయలు సంపాదించాడట.
ఇటీవలే రెడ్ నోటీస్ అనే సినిమాలో నటించినందుకు దాదాపు 175 కోట్లు తీసుకుని రికార్డు సృష్టించాడు. అదే సినిమాలో నటించిన ర్యాన్ రెనాల్డ్ 71.5 మిలియన్ల డాలర్లతో సెకండ్ ప్లేస్ దక్కించుకున్నాడు. అలాగే ప్రొడ్యూసర్ మార్క్ వాల్ బెర్గ్ 58 మిలియన్లతో మూడో స్థానంలో ఉండగా.. యాక్టర్ అండ్ డైరెక్టర్ బెన్ అఫ్లెక్ 55 మిలియన్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక 54 మిలియన్లతో విన్ డీజిల్ ఐదో స్థానంలో నిలవగా.. ఇక ఆరో స్థానంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ 48.5 మిలియన్ల సంపాదన ఖాతాలో వేసుకున్నాడట. ఆ తర్వాత ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలలో.. లిన్ మ్యాన్యుయేల్ మిరాండా, విల్ స్మిత్, ఆడమ్ సాండ్లర్, జాకీ చాన్ నిలిచారు. అక్షయ్ కుమార్ యాడ్స్, సినిమాల్లో నటించండం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందాడు. 48.5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 363 కోట్ల ఆదాయం వెనకేసుకున్నాడట. ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్షయ్.. బెల్ బాటమ్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఆయన నటించిన లక్ష్మిబాంబ్ సినిమా త్వరలో హాట్ స్టార్ లో విడుదల కానుంది.