ఆ స్టార్ హీరోని లైంగికంగా వేధించార‌ట‌!

Update: 2017-07-28 10:46 GMT

ప్ర‌స్తుతం సమాజంలో మ‌హిళ‌ల‌ను ప‌ట్టి పీడిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య లైంగిక వేధింపులు. వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది మ‌హిళ‌లు ఏదో ఒక సంద‌ర్భంలో లైంగిక వేధింపుల‌కు గుర‌వుతున్నారు. ఈ విష‌యంలో మ‌హిళా సెల‌బ్రిటీలు - సినిమా స్టార్ల‌కు కూడా మిన‌హాయింపేమీ లేదు. అయితే,కొంత మంది పురుషులు కూడా లైంగిక వేధింపుల‌కు బాధితులేన‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ వెల్ల‌డించాడు. త‌న చిన్న‌త‌నం లో మ‌హిళ‌ల్లాగే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపాడు.

ముంబయిలో మానవ అక్రమ రవాణా అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో అక్షయ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త‌న చిన్న‌త‌నంలో జ‌రిగిన ఓ సంఘటనను స‌భికుల‌తో పంచుకున్నారు. తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాన‌ని అక్కీ తెలిపాడు.

‘నా చిన్నప్పుడు మేముంటున్న అపార్ట్‌ మెంట్‌ లోని లిఫ్ట్‌ లో వెళుతుంటే పక్కనే ఉన్న లిఫ్ట్‌ బాయ్‌ నన్ను ఎక్కడపడితే అక్కడ తాకాడు. వెంటనే ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పాను. దాంతో వాళ్లు అత‌డిని హెచ్చరించి వదిలేశారు. ఆ తర్వాత కూడా అతడు ఇలాంటి  కేసులోనే జైలుకు వెళ్లాడు కాబట్టి.. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పెద్దవాళ్లకు చెప్పాలి. అప్పుడే ఇలాంటి పనులకు పాల్పడేవారికి బుద్ధిచెప్పగలం.’ అని అక్ష‌య్ కుమార్‌ తెలిపాడు. ప్రస్తుతం అక్షయ్‌.. ‘టాయ్‌ లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ చిత్రంలో నటిస్తున్నారు. స్వ‌చ్ఛ భార‌త్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్‌ 11న విడుద‌ల కానుంది.
Tags:    

Similar News