బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే ఆ సినిమాలో అన్ని తరహా అంశాలను ఉండేట్లు చూసుకుంటాడు. సందేశాత్మకమైన చిత్రాలతో ఎక్కువగా నటిస్తూనే.. ఆ సినిమాలో కామెడీ ఉండేట్లు చూసుకుంటాడు. ఎన్ని ప్రయోగాత్మకమైన పాత్రల్లో నటించినా కామెడీ పండించలేని నటుడు అసలైన నటుడే కాదంటున్నాడు అక్షయ్.
రీసెంట్ గా అక్షయ్ ఆ విషయంపై ప్రస్తావించాడు. తెరపై నటనతో ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేయడం సాధారణమైన విషయమే. కానీ మన టైమింగ్ తో ప్రేక్షకుడికి నవ్వించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక్కోసారి మనం చెసే కామెడీ వారికి అంతగా నచ్చకపోవచ్చు. అంతే కాకుండా చిరాకుగా కూడా అనిపించవచ్చు. కామెడీ పాత్రలు చేయడం అనేది ఒక కళ. నువ్వు ఆ కళను ఎలా స్వీకరించావు అనేదే చాలా ముఖ్యమని అక్షయ్ వివరించాడు.
అసలు విషయం ఏమిటంటే.. అక్షయ్ కుమార్ 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ అనే కామెడీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ ఈ విషయాన్ని తెలిపాడు. ఇటీవల విడుదలైన ఆయన చిత్రం టాయిలెట్ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది.