అమలా పాల్ సినిమాల్లో నటించడం ఎ.ఎల్.విజయ్ కు ఇష్టం లేదని.. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే విడాకుల దాకా వెళ్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఐతే విడాకులు నిజమేనా.. నిజమే అయితే అందుకు కేవలం అమలా సినిమాల్లో నటిస్తాననడమే కారణమా.. స్వయంగా ఓ దర్శకుడై ఉండి విజయ్ ఈ విషయంలో అంతగా అభ్యంతరపెడతాడా.. అంటూ చర్చ నడుస్తోంది. ఐతే ఇప్పుడు స్వయంగా విజయ్ తండ్రి.. అమలా పాల్ మామ అయిన అళగప్పనే స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. అమలా తమ అభీష్టానికి వ్యతిరేకంగా సినిమాల్లో నటిస్తుండటమే విడాకులకు దారి తీసిందని ఆయన స్పష్టం చేశాడు.
పెళ్లయ్యాక నటన మానేసి ఆదర్శ భారతనారిగా ఉండాలన్న తమ ఆకాంక్షకు వ్యతిరేకంగా అమల నడుచుకుందని.. తన ఇష్టానుసారం సినిమాలు ఒప్పుకుందని.. విజయ్ కు ఇది నచ్చక ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అళగప్పన్ చెప్పాడు. ఇక సినిమాలు చేయనంటూ హామీ ఇచ్చిన అమల ఆ తర్వాత దాన్ని పక్కనబెట్టేసిందని.. ముందు పాటలు పాడిందని.. ఇప్పుడు వరుసగా సూర్య.. ధనుష్ లతో సినిమాలకు ఓకే చేసిందని అళగప్పన్ తెలిపాడు. విజయ్-అమల ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. వాళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్న మాట వాస్తవమని.. న్యాయపరంగానే అన్నీ జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఐతే ఓ దర్శకుడైన విజయ్.. అమలా సినిమాల్లో నటించకుండా అడ్డుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పైగా ఆమె పెళ్లయ్యాక గ్లామర్ రోల్స్ ఏమీ చేయలేదు. పద్ధతిగానే కనిపిస్తోంది కూడా.