అల్లు అర్జున్‌ కలిసి నటిస్తారా.. ఆలియా సమాధానం ఇదే!

Update: 2022-02-04 17:12 GMT
ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. పుష్ప సినిమా తర్వాత ఆయన ఏకంగా బాలీవుడ్‌ ప్రేక్షకులకు మరియు బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ కు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిపోయాడు. పుష్ప సినిమా లో ఆయన నటనకు హిందీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కళ్లు మూసినా తెరచినా పుష్ప అన్నట్లుగా వారు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప సినిమా తో స్టార్‌ డమ్‌ దక్కించుకున్న ఐకానిక్ స్టార్‌ అల్లు అర్జున్ బాలీవుడ్‌ లో నటించే అవకాశాలు లేకపోలేదు. ఇదే సమయంలో ఇక మీదట ఆయన నటించే ప్రతి ఒక్క తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ముఖ్యంగా హిందీలో డబ్‌ అవ్వడం ఖాయం అంటున్నారు. కేరళలో ఎలా అయితే బన్నీకి అభిమానులు ఉన్నారో ఇక మీదట ఉత్తర భారతంలో కూడా బన్నీ అభిమానులు ఉంటారు అనేందుకు ఆలియా భట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్ష నిదర్శనం అనడంలో సందేహం లేదు.

ఆలియా భట్‌ హీరోయిన్ గా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన గంగూభాయ్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గంగూభాయ్ సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. నేడు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో ఆలియా మాట్లాడుతూ అల్లు అర్జున్‌ గురించి వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్‌ తో సినిమాలు చేసే అవకాశం ఉందా అంటే తప్పకుండా చేస్తా అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్‌ తో సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్‌ సినిమా లో నటించిన ఆలియా భట్‌ త్వరలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందబోతున్న సినిమాలో కూడా నటించేందుకు కమిట్‌ అయ్యింది. కనుక అల్లు అర్జున్‌ తో కూడా ఆమె సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె స్వయంగా అల్లు అర్జున్‌ తో సినిమా అవకాశం వస్తే చేస్తానంటూ ప్రకటించింది.

ప్రస్తుతం బన్నీ తో నటించడం నా కంటే నా కుటుంబ సభ్యులకు ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. పుష్ప సినిమా చూసిన తర్వాత ఆలియా భట్ కుటుంబ సభ్యులు అల్లు అర్జున్‌ అంటే అభిమానం పెంచుకున్నారట. అందుకే ఆలియా ను అల్లు అర్జున్‌ సినిమాలో నటించాలని ఒత్తిడి చేస్తున్నారట. సోషల్‌ మీడియాలో ఇప్పటికే అల్లు అర్జున్‌ తో ఆలియా సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు ఆలియా వ్యాఖ్యలతో సమాధానం లభించినట్లు అయ్యింది. ఆలియా భట్‌ మరియు అల్లు అర్జున్ ల కాంబోలో త్వరలోనే సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు అనేది కాలమే నిర్ణయించాలి. ఇక అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. ఈ నెల చివరి నుండి పుష్ప 2 రెగ్యులర్ సూటింగ్‌ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే ఏడాది డిసెంబర్‌ లో సినిమా ను విడుదల చేస్తారట. సమ్మర్‌ చివరి వరకు బన్నీ కొత్త సినిమా ను కూడా ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో ఏమైనా ఆలియాకు ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News