మాజీ ప్రేయసి ముందు ఈ ప్రేయసి ఒప్పుకుంది

Update: 2018-10-23 04:28 GMT
బాలీవుడ్లో వరుసగా ప్రేమకథలు ఒక్కొక్కటిగా పండుతున్నాయి. ఒక జంట తర్వాత ఇంకో జంట పెళ్లి వైపు అడుగులు వేస్తోంది. నేహా ధూపియా.. సోనమ్ కపూర్ ఈ ఏడాదే పెళ్లి బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ కు ఎగిరెళ్లిపోయిన ప్రియాంక చోప్రా.. అమెరికన్ కుర్రాడు నిక్ జోనాస్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ ఏడాది చివర్లో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక తాజాగా రణ్ వీర్ సింగ్-దీపికా పదుకొనే కూడా తమ పెళ్లి సంగతి ధ్రువీకరించారు. వీళ్లిద్దరి పెళ్లి నవంబరు 14-15 తేదీల్లో జరగబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక బాలీవుడ్ జనాలు అత్యంత ఆసక్తిగా చూస్తున్న జంట.. రణబీర్ కపూర్-ఆలియా భట్. హీరోగా కొంచెం పేరు రాగానే ప్లేబాయ్ అవతారం ఎత్తిన రణబీర్.. ఇప్పటికే చాలామంది అమ్మాయిలతో తిరిగాడు.

ఒక దశలో కత్రినా కైఫ్ తో పెళ్లికి దగ్గరగా వెళ్లాడు. కానీ ఆ బంధం నిలవలేదు. ఐతే కొంత కాలంగా అతను మహేష్ భట్ తనయురాలు ఆలియా భట్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం అందరూ చూశారు. కానీ తమ ప్రేమ సంగతి మాత్రం ఇద్దరూ ధ్రువీకరించలేదు. ఐతే తాజాగా కరణ్ జోహార్ నిర్వహించే ఓ కార్యక్రమంలో ఆలియా.. తన ప్రేమ గురించి ఓపెన్ అయింది. ముందు కరణ్ ఒత్తిడి తెచ్చినా నోరు విప్పని ఆలియా.. ప్రోగ్రాం చివర్లో మాత్రం తాను రణబీర్ తో రిలేషన్ షిప్ లో ఉన్న మాట వాస్తవమే అని అంగీకరించింది. విశేషం ఏంటంటే ఈ కార్యక్రమంలో దీపికా పదుకొనే కూడా పాల్గొంది. ఆమె ఒకప్పుడు కొంత కాలం రణబీర్ తో డేటింగ్ చేయడం విశేషం. మొత్తానికి రణబీర్ మాజీ ప్రేయసి ముందు కొత్త ప్రేయని అతడితో తన ప్రేమ బంధాన్ని వెల్లడించడం విశేషం. మరి ఆలియాతో అయినా అతను సిన్సియర్ గా ఉండి పెళ్లి చేసుకుంటాడా.. లేక పాత బాటలోనే సాగుతాడా అన్నది చూడాలి.


Tags:    

Similar News