అస‌లు ఈ సెహ్మ‌త్ ఖాన్ క‌థేంటంటే..

Update: 2018-04-10 23:30 GMT
అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘రాజి’ చిత్ర ట్రైల‌ర్ నిన్న‌నే విడుద‌ల‌యింది. ఈ సినిమాలో పాకిస్థాన్ కుర్రాడిని పెళ్లి చేసుకుని... ఆ దేశానికి వెళ్లే భార‌తీయ ముస్లిం అమ్మాయి సెహ్మ‌త్ ఖాన్ పాత్ర‌లో క‌నిపించింది అలియా భ‌ట్‌. ఎప్పుడూ లేనంత మెచ్యూర్డ్ యాక్టింగ్ తో ఇర‌గ‌దీసేసిందీ చిన్న‌ది. అయితే ట్రైల‌ర్ లోనే ఇదో ట్రూ స్టోరీ అంటూ టైటిల్స్ వేసింది చిత్ర యూనిట్‌. ఇంత‌కీ ఈ సెహ్మ‌త్ ఖాన్ ఎవ‌రంటే...

సెహ్మ‌త్‌... క‌శ్మీర్ లో నివ‌సించే ఇండియ‌న్ ముస్లిం అమ్మాయి. ఆమె తండ్రి ఓ మిల‌ట‌రీ అధికారి. ఆయ‌న చేతుల్లో అపురూపంగా పెరుగుతుంది సెహ్మ‌త్‌. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న వైరం గానీ- గొడ‌వ‌లు గానీ ఆమెకి తెలియ‌దు. దేశ ర‌క్ష‌ణ కోసం త‌న కూతురునే ఆయుధంగా వాడాల‌నుకుంటాడు ఆమె తండ్రి. ఓ పాక్ ముస్లిం మిల‌ట‌రీ అధికారికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దేశం కోసం జీవితం గొప్ప‌ది కాద‌ని చెబుతాడు. వివాహం త‌ర్వాత పాకిస్థాన్ లో అడుగుపెట్టిన సెహ్మ‌త్ ఖాన్‌- మిల‌ట‌రీ క్యాంపులో తిరుగుతూ వారి ర‌హ‌స్యాల‌ను తండ్రికి చేర‌వేస్తూ ఉంటుంది. స్పైగా ప‌నిచేస్తూ భార‌తీయ మిల‌టరీకి 1971 యుద్ధంలో స‌హాయ‌ప‌డుతూ ఉంటుంది. ఈ విషయం ఆమె చ‌నిపోయే వ‌ర‌కూ తెలీదు.

ఆమె చ‌నిపోయిన త‌ర్వాత సెహ్మ‌త్ ఖాన్ ఓ స్పైగా స్వ‌దేశానికి సేవ చేసింద‌నే విష‌యం తెలుస్తుంది. ఇదే ‘రాజి’ సినిమాకి ఆధార‌మైన‌ ‘కాలింగ్ సెహ్మ‌త్‌’ అనే న‌వ‌ల క‌థ‌. అయితే ఇది య‌ద్ధార్థ గాథే. కానీ నిజ‌జీవితంలో స‌ద‌రు స్పై మ‌హిళ పేరు చెప్ప‌డానికి నిరాక‌రించ‌డంతో సెహ్మ‌త్ ఖాన్ అనే పేరును ఎంచుకున్నాడు న‌వ‌లా ర‌చ‌యిత‌. దేశ‌భ‌క్తి- ప్రేమ‌- మ‌తం... ఈ మూడింటి మీద తిరిగే ‘రాజి’ సినిమా మే 11న విడుద‌ల కాబోతోంది.



Tags:    

Similar News