ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం `డార్లింగ్స్`. కింగ్ ఖాన్ షారూక్ తో కలిసి ఆలియా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. డార్లింగ్స్ రిలీజ్ ప్రచారంలో ఆలియా చెబుతున్న ముచ్చట్లు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఆలియా తాజాగా రెండు కీలక విషయాలపై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.
కెరీర్ ఆరంభంలో ఒక వ్యక్తి చేసిన సెక్సిస్ట్ కామెంట్లు చిరాకు పుట్టించడమే గాక కలతకు గురి చేసాయని ఆలియా భట్ తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే బ్రా బయటకు కనిపించకూడదు! ఇంట్లో బెడ్ పై దుస్తులు ఎలా పడితే అలా పడేయకుండా దాచిపెట్టాలి!! లాంటి మాటలు తనకు నచ్చవని తెలిపింది.
అంతేకాదు పెద్ద సినిమాల బాక్సాఫీస్ నష్టాల గురించి కూడా తనదైన శైలిలో మాట్లాడింది. సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఆడినప్పుడు తారల పారితోషికాలను తిరిగి అంచనా (రీఅసెస్) వేయాలని కూడా అంది. కొత్త ఇంటర్వ్యూలో అలియా మాట్లాడుతూ-``ప్రస్తుత కాలంలో బాక్సాఫీస్ వద్ద డబ్బు తెచ్చే చోదక శక్తి కంటెంట్. కంటెంట్ నుండి స్టార్ డమ్ వస్తుంది`` అని కూడా ఆలియా అంది.
ఆలియా భర్త-నటుడు రణబీర్ కపూర్ చిత్రం `శంషేరా` బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన కొన్ని రోజుల తర్వాత ఫ్లాప్ చిత్రాల గురించి స్టార్ల పారితోషికం రీఅసెస్ మెంట్ గురించి అలియా చేసిన కామెంట్ వేడెక్కించింది. రణబీర్ నటించిన శంషేరా జూలై 31 వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లు సంపాదించింది. ఈ చిత్రం రూ.150 కోట్లతో తెరకెక్కగా దాదాపు 100 కోట్లు నష్టపోవాల్సిన సన్నివేశం కనిపిస్తోంది.
తమ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడకపోయినా లేదా ఫ్లాప్ అయినా ఒక స్టార్ ఎంత సంపాదిస్తాడనే దాని గురించి కూడా అలియా క్లారిటీగా మాట్లాడింది. సినిమా బడ్జెట్ తో తారల పారితోషికాలు సమతుల్యంగా ఉండాలనేది నేను అంగీకరిస్తున్నాను. అయితే తారలు ఎంత వసూలు చేయాలో నేను ఎవరికీ చెప్పను. క్యుంకీ మెయిన్ తో చోటి హన్ (నేను చిన్నమ్మాయిని కాబట్టి). తమ సినిమాలు పేలవంగా ఆడాయని తెలిసిన తర్వాత పెండింగ్ లో ఉన్న ఫీజులను వసూలు చేయని నటులు (లేదా డబ్బు తిరిగి ఇవ్వడం) కూడా ఉన్నారని ఆమె అన్నారు. సాధారణంగా కొంత పునరాలోచన జరగాల్సిన అవసరం ఉందా అని మీరు నన్ను అడిగితే నిర్మాతలందరూ ఆ విధంగా ఆలోచిస్తున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను... ఒక స్టార్ కూడా అలా ఆలోచిస్తున్నాడని ఆలియా అన్నారు.
ప్రస్తుత మోడరేట్ వరల్డ్ లో స్టార్ ల గురించి ప్రస్థావిస్తూ..``స్టార్ ను చేసేది ఏదీ? అంటే ప్రేమ అని చెబుతూనే..బాక్సాఫీస్ వద్ద డబ్బు తేగలిగే ఒక నిర్దిష్టమైన స్టార్ కంటెంట్ అని తెలిపింది. కంటెంట్ లేకుండా స్టార్ డమ్ సాధ్యపడదని కూడా అంది. కంటెంట్ అనే శక్తి ప్రేక్షకులను సినిమా థియేటర్లకు లాక్కొస్తుంది. మంచి కంటెంట్ ని కాల పరీక్షగా ప్రజలు పరిశీలించాలి. వీక్షకులకు ఇచ్చే కంటెంట్ నుండి స్టార్ డమ్ వస్తుంది`` అని అన్నారు.
అలియా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి హిందీ చిత్రం డార్లింగ్ లోను ఆలియా కనిపించనుంది. ఆలియా- విజయ్ వర్మ-షెఫాలీ షా తదితరులు నటించిన డార్క్ కామెడీ డార్లింగ్స్ ఆగస్టు 5న నెట్ ఫ్లిక్స్ లో ప్రారంభమవుతుంది. అయాన్ ముఖర్జీ `బ్రహ్మాస్త్ర`లో ఆలియా కనిపిస్తుంది. ఇది రణబీర్ కపూర్ తో ఆలియా మొదటి చిత్రం. ఆమె రణవీర్ సింగ్ తో కలిసి కరణ్ జోహార్ `రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ`.. ప్రియాంక చోప్రా - కత్రినా కైఫ్ లతో ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించిన `జీ లే జరా`లో కూడా కనిపిస్తుంది. తన హాలీవుడ్ చిత్రం `హార్ట్ ఆఫ్ స్టోన్` సహా పలు ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ స్పై థ్రిల్లర్ లో గాల్ గాడోట్ - జామీ డోర్నన్ కూడా నటించారు.