తార‌క్ ని తక్కువ‌గా అంచ‌నా వేసిన అలియా భ‌ట్‌

Update: 2022-01-03 15:46 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు, గోండు బెబ్బులి కొమురం భీం క‌లిసి బ్రిటీష్ ఇండియాపై యుద్ధం ప్ర‌క‌టిస్తే ఏం జ‌రిగింది అనే ఫిక్ష‌న‌ల్ స్టోరీకి ఫాంట‌సీ అంశాల్ని జోడించి రాజ‌మౌళి ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కించారు. భార‌తీయ సినీ ఇండ‌స్ట్రీలోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న సంక్రాంతి సంద‌ర్భంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కావాల్సింది. కానీ అనూహ్యంగా ఒమిక్రాన్‌, క‌రోనా వైర‌స్ లు ప్ర‌బ‌లుతుండ‌టం...

మ‌ళ్లీ థ‌ర్డ్ వేవ్ సంకేతాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో సినిమాకు ప్ర‌మాదం అని భావించిన చిత్ర బృందం ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేశారు. సినిమా రిలీజ్ వాయిదాకు ముందు వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ ని ఓ రేంజ్ లో హోరెత్తించారు. అయితే సినిమా విడుద‌ల వాయిదా ప‌డ‌టం మూవీ టీమ్ తో పాటు `ఆర్ ఆర్ ఆర్` అభిమానుల్ని కూడా నిరాశకు గురిచేసింది.

ఈ మూవీ రిలీజ్ కోసం క్ష‌ణం తీరిక లేకుండా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ తీవ్రంగా ఒత్తిడికి లోన‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో `ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌మోష‌న్స్ లో హీరోయిన్ అలియా భ‌ట్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని త‌క్కువ‌గా అంచ‌నా వేసిన‌ట్టుగా తెలుస్తోంది.

`ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా బాలీవుడ్ ఫేమ‌స్ టాక్ షో అయిన `క‌పిల్ శ‌ర్మ‌` టాక్ షోలో రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, రాజ‌మౌళి, ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ షోలో పాల్గొన్న ఎన్టీఆర్ ని క‌పిల్ శ‌ర్మ ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న వేశారు. `ఆంధ్రా వాలా` ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ చాలా ఫేమ‌స్ అయింద‌ని, ఆ ఫంక్ష‌న్ కి భారీ స్థాయిలో అభిమానులు హాజ‌రు కావ‌డం ఓ రికార్డుగా నిలిచింద‌ని, ల‌క్ష‌ల్లో జ‌నాలు ఆ ఫంక్ష‌న్ కి హాజ‌ర‌య్యార‌ని తెలిపాడు.

క‌పిల్ శ‌ర్మ చెబుతుండ‌గానే ఎన్టీఆర్ మాట్లాడ‌టం మొద‌లుపెట్టారు. ఆ ఆడియో ఫంక్ష‌న్ కి దాదాపు 9 నుంచి 10 ల‌క్ష‌ల మంధి హాజ‌ర‌య్యార‌ని తెలియ‌జేశాడు. మ‌ధ్య‌లో అలియా భ‌ట్ క‌ల‌గ‌జేసుకుని ఆడియో ఫంక్ష‌న్ కి ప‌ది ల‌క్ష‌ల మందా.. 9 నుంచి ప‌ది వేల మంది పాల్గొని వుంటార‌ని అనుకుంటున్నాన‌ని చెప్పి ఎన్టీఆర్ ఇమేజ్‌ని త‌క్కువ‌గా అంచ‌నా వేసే ప్ర‌య‌త్నం చేసింది. ఆ త‌రువాత క‌పిల్ శ‌ర్మ చెప్ప‌డంతో త‌ను ఎన్టీఆర్ ని త‌క్కువ‌గా అంచ‌నా వేశాన‌ని తెలుసుకుంది.

పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు స్వ‌స్థ‌ల‌మైన నిమ్మ‌కూరులో అత్యంత భారీగా నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి అప్ప‌టి ప్ర‌భుత్వం భారీగా ఏర్పాట్లు చేయ‌గా వివిధ ప్రాంతాల నుంచి ప్ర‌త్యేక రైళ్ల‌లో అభిమానులు నిమ్మ‌కూరు చేరుకోవ‌డం తెలిసిందే. 2003 డిసెంబ‌ర్ 5న ఈ ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగింది.


Tags:    

Similar News