బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఇప్పుడు అలియా భట్ చక్రం తిప్పేస్తోంది. హిందీలో ఆమె చేసిన 'గంగూబాయి' భారీ విజయాన్ని సాధించి పెట్టింది. ఇక పాన్ ఇండియా సినిమాగా ఆమె చేసిన 'ఆర్ ఆర్ ఆర్' కూడా ఆల్రెడీ 1000 కోట్ల వసూళ్లను దాటేసింది. చాలా తక్కువ గ్యాప్ లో అలియా ఇలా సంచలన విజయాలను అందుకుంది. ఇక ఆ తరువాత కూడా ఆమె చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవలే రణ్ బీర్ జీవితంలోకి అర్థాంగిగా అడుగుపెట్టిన అలియా, చిన్న బ్రేక్ తరువాత మళ్లీ రంగంలోకి దిగిపోయింది.
ప్రస్తుతం ఆమె కరణ్ జోహార్ దర్శకత్వంలో 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమా చేస్తోంది. వచ్చే ఏడాది 'వేలెంటైన్స్ డే'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే వెబ్ సిరీస్ లో చేయనుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె 3 నెలల సమయాన్ని కేటాయించింది. యూకేలో ఈ వెబ్ సిరీస్ షూటింగు కొనసాగుతుంది. స్పై థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ వెబ్ సిరీస్ కి 'టామ్' దర్శకత్వం వహించనున్నాడు.
ఈ వెబ్ సిరీస్ తరువాత ఆమె మరో భారీ ప్రాజెక్టును లైన్లో పెట్టేసింది. ఆమె చేయనున్న సినిమా పేరే 'జీ లే జరా'. ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రియాంక చోప్రా .. కత్రినా కైఫ్ తో పాటు ఈ సినిమాలో అలియా కూడా నటిస్తుంది. ఈ ముగ్గురు చుట్టూనే ఈ కథ నడుస్తుంది. భారీ బడ్జెట్ లో .. మల్టీ లొకేషన్స్ లో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగు మొదలవుతుంది. డొమెస్టిక్ రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. హిందీతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.