అబ్బాయిల‌కు అందుకే ప‌డిపోతా..

Update: 2015-11-03 22:30 GMT
తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ తో కుర్రాళ్ల మ‌తులు చెద‌ర‌గొట్టింది కుర్ర హీరోయిన్ అలియ‌భ‌ట్‌. ఒక్క బికినీ ఆమే ఫేట్ నే మార్చేసింది. అమ్మ‌డు బికినీకే కొత్త అందాన్ని తీసుకొచ్చింది. త‌ర్వాత రోడ్ జ‌ర్నీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన హైవే సినిమాతో మ‌రో విజ‌యం ద‌క్కించుకుంది. 2 స్టేట్స్ - హంప్టీ శ‌ర్మాకి దుల్హానియా సినిమాల‌తో మెప్పించింది. ఇటీవ‌ల విడుద‌లైన షాందార్ లో పింక్ క‌ల్ ర్ టూ పీస్ వేసి మ‌ళ్లీ ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం సొగ‌స‌రి న‌టించిన రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇటీవ‌ల అమ్మ‌డు త‌న అందం గురించి కొన్ని సీక్రెట్ విష‌యాలు రివీల్ చేసింది. వృత్తిగ‌త‌, వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ప్ర‌త్యేక‌గా ముచ్చ‌టించింది. ఆ వివ‌రాలు మీకోసం

=నేను  చాలా క్యూట్ గా  యాక్టివ్‌ గా ఉంటానని అందరూ అంటుంటారు. కానీ  నాకు బద్దకం ఎంత ఎక్కువో వాళ్లకు తెలీదు పాపం. నిద్రపోవడానికి  నేనిచే ఇంపార్టెన్స్ మ‌రొక‌రెవ్వ‌రు ఇవ్వ‌రేమో. సినిమా  షూటింగ్ లేనప్పుడు  పదిహేను గంటలు ఏక ధాటిగా నిద్రపోతుంటాను. తిన‌డం ప‌డుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాను. గ్లామ‌ర్ కోసం త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటాను.  గ్లామర్ పెరగడానికి నిద్ర కూడా చాలా అవ‌స‌రం. బ‌హుషా నా అందం ర‌హ‌స్యం అదే అయి ఉండొచ్చు.

=నేను బాగా నటిస్తానని చాలామంది మెచ్చుకుంటుంటారు. అయితే నాకు ఏడవడం సరిగ్గా రాదు.  నా ఏడుపు నాకే ఆర్టిఫీషియల్‌ గా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ పరిణీతి చోప్రా ట్రాజెడీ సీన్ లలో ఎంత బాగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుందో. అందుకే ‘ఇషక్‌ జాదే’ సినిమా చూశాక తన దగ్గరకు వెళ్లి... ‘నాకు నీ అంత బాగా ఏడవడం నేర్పించు’ అని అడిగాను.

=అందరూ తన లవర్  అందంగా ఉండాలి, అర్థం చేసుకునేవాడై ఉండాలి అని చెబుతుంటారు కదా! నాకు మాత్రం నా లవర్ ఎప్పుడూ సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. మంచి వాసన నన్ను వెంటనే అట్రాక్ట్ చేస్తుంది. అబ్బాయిల విషయంలో కూడా నేను త్వరగా పడిపోయేది దానికే. ఇంకో సీక్రెట్ చెప్పనా? నేను ఎప్పుడూ మగాళ్ల పర్‌ ఫ్యూమ్సే వాడతాను. పైగా నెలకొకటి మారుస్తుంటాను!

=నాకు మూడేళ్లున్నప్పుడు నాన్న గారు (దర్శకుడు మహేష్‌ భట్) తన సినిమా ఒకటి సేషెల్స్‌ లో తీయాలని ప్లాన్ చేశారు. తాను ఎలాగూ వెళ్తున్నాను కదా అని ఫ్యామిలీని కూడా వెంట తీసుకెళ్లారు. అప్పుడు నేను తప్పిపోయానట. హోటల్ రూమ్ నుంచి నడచుకుంటూ అలా అలా బయటికి వెళ్లిపోయానట. కంగారుపడి వెతికితే ఓచోట రోడ్డుమీద నడుస్తూ కనిపించానట. అప్పుడు వాళ్లకి దొరక్కపోయి ఉంటే ఇప్పుడు నేనెక్కడుండేదాన్నో.

=నాకు జంక్‌ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పడి చస్తాను. రోజులో ఎన్నిసార్లు తినమన్నా, ఎన్ని తినమన్నా తినేస్తాను. అయితే నేనేదీ వేడిగా ఉంటే తినలేను. కాఫీ దగ్గర్నుంచి ప్రతి ఫుడ్‌ నీ చల్లారబెట్టుకునే తింటాను. పైగా ఏం తిన్నా అందులో పెరుగు కలుపుకోవడం ఇష్టం నాకు. చైనీస్ - ఇటాలియన్ - మెక్సికన్... తినేది ఏదైనా అందులో పెరుగు కలిపేస్తా. నేనలా చేస్తుంటే నా ఫ్రెండ్సంతా ముఖాలు అదోలా పెడతారు. అయినా నేను మానను.

= బయటి నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే నేను చేసే మొదటి పని ఏంటో తెలుసా? కాళ్లు కడుక్కోవడం. ఆ పని చేశాకే ఏ పనైనా చేస్తా.

= నాకు విమాన ప్రయాణాలంటే కూడా యమా ఇష్టం. గాలిలో తేలేటప్పుడు మనసు కూడా ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది. అదో గొప్ప అనుభూతి. ఆ అనుభూతి కోసం ఎప్పుడూ అలా విమానాల్లో ప్రయాణిస్తూనే ఉండిపొమ్మన్నా ఓకే నాకు ఇష్ట‌మే.

=నేను హిందీ చాలా బాగా మాట్లాడతానని కొందరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. వాళ్లకు అలా ఎందుకనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే... నాకు హిందీ అంత బాగా ఏమీ రాదు. స్కూల్లో హిందీ వక్తృత్వ పోటీల్లో ఎప్పుడూ ఓడిపోయేదాన్ని. మరి నా హిందీ బాగోవడమేమిటో.

=నేను అస్తమానం నా స్టయిల్‌ ను మార్చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఒకేలా ఉండటం నాకు నచ్చదు. ఏ కొత్త స్టయిల్ కనిపిస్తే దాన్ని ఫాలో అయిపోతుంటా. ఒక్కోసారి అది నప్పక నాకు నేనే విచిత్రంగా కనిపిస్తాను. దాంతో దెబ్బకి దాన్ని మార్చేసి మరో కొత్త స్టయిల్ మొదలుపెడతాను. అలాగే పుస్త‌కాలు కూడా బాగా చ‌దువుతా. మార్కెట్ లోకి వ‌చ్చే కొత్త పుస్త‌కాల‌న్ని సేక‌రిస్తా. అయితే ఏ రోజు కూర్చుని చ‌దివిన సంద‌ర్భాలు లేవు.
Tags:    

Similar News