ఈవిడ బాలీవుడ్‌ రేసుగుర్రం

Update: 2015-06-10 04:32 GMT
'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' చిత్రంతో వెండితెరకి పరిచయమైంది ఆలియాభట్‌. వస్తూనే హిట్‌ కొట్టింది. భట్‌ల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా తనకి బాలీవుడ్‌ ఆరంగేట్రం సులువే అయినా తర్వాత సొంత ట్యాలెంటుతోనే మనుగడ సాగించే రేంజుకి ఎదిగేసింది. కష్టించేతత్వం, కలుపుగోలుతనం ఈ అమ్మడి సొంతం. అందుకే దర్శకనిర్మాతలు పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఆలియా నటించిన సినిమాలు చూస్తే తనలోని ఎనర్జీ లెవల్స్‌, ఈజ్‌ వేరే నాయికల కంటే రెట్టింపు ఉంటుందని చెబుతారంతా. ఆలియాలోని ఎనర్జీ పరిశీలిస్తే రేసుగుర్రాన్ని తలపిస్తుందని అభిమానులు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల్ని, వాటితో పాటే షెడ్యూల్స్‌ని పరిశీలిస్తే ఆ మాట ఎవరైనా అనాల్సిందే.

ప్రస్తుతం ఆలియా ఉడ్తా పంజాబ్‌, షాందార్‌కపూర్‌ అండ్‌ సన్స్‌, శుద్ధి చిత్రాల్లో నటిస్తోంది. తొలి రెండూ ఆన్‌సెట్స్‌ ఉండగానే మిగతా రెండూ సెట్స్‌కెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఒకేసారి నాలుగు సినిమాల్ని మేనేజ్‌ చేయడం అంటే ఆషామాషీనా. అందుకే ఆలియాని రేసుగుర్రంతో పోల్చింది.

Tags:    

Similar News