బాల్యం అనేది తిరిగిరానిది. ఎన్నో తీపి గుర్తుల సమాహారం. బాల్యంలో ఉన్నప్పటి మెమరీ కూడా అసాధారణమైనది. నాటి తీపి జ్ఞాపకాలు పదే పదే వెన్నాడుతూ ఉంటాయి. ఎదిగాక సాధకబాధకాలు సంసార సాగరం బాధల నడుమ బాల్యాన్ని నెమరు వేసుకుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇప్పుడు అవే తీపి గుర్తుల్ని నెమరు వేసుకుంటోంది ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్.
అలియా తన చిన్ననాటి తీపి జ్ఞాపకాల్ని ఆ రోజులను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొత్త వీడియోలో పునః సమీక్షించుకుంది. ఈ వీడియోలో అలియా ఒక అడవిలో తిరుగుతూ ఇద్దరు పిల్లలతో ఆడుకుంటోంది. అలియా దీనికి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది.
``బాల్యం! ప్రపంచం మీ ఆట స్థలంగా భావించే సమయం`` అంటూ వ్యాఖ్యను జోడించింది. కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉండిపోయి షూటింగులకు దూరమైన 27 ఏళ్ల ఆలియా ఇటీవల తిరిగి చిత్రీకరణలో జాయినైంది. ఈ నెల ప్రారంభంలో ముంబైలో 10 రోజుల షెడ్యూల్ కోసం అలియాపై `బ్రహ్మాస్త్రా` బృందం చిత్రీకరణ సాగించింది. ఈ ఫాంటసీ డ్రామా ఈ పాటికే పూర్తవ్వాల్సి ఉన్నా.. అనేక మార్లు రకరకాల కారణాలతో ఆలస్యం అయ్యింది. 2020 డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉన్నా.. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మళ్లీ వాయిదా పడింది. బ్రహ్మాస్త్రంలో అమితాబ్ బచ్చన్- నాగార్జున అక్కినేని - డింపుల్ కపాడియా కూడా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మస్త్రా ప్రతిష్టాత్మక ఫాంటసీ అన్న సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్ర- ఆర్.ఆర్.ఆర్ లతో పాటు పలు పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులకు ఆలియా సంతకాలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ది బెస్ట్ పెర్ఫామర్ గా ఆలియాకు గుర్తింపు ఉంది. నంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతున్న యువనాయికగా పాపులరవుతోంది.
రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజు సహచరి సీతగా నటిస్తోంది. రామ్ చరణ్ - ఆలియా జంటపై కీలక సన్నివేశాల్ని రాజమౌళి చిత్రీకరించనున్నారని ప్రచారమవుతోంది.