గత కొంతకాలంగా క్వీన్ కంగన ఎటాకింగ్ స్టైల్ గురించి ఫిలిం సర్కిల్స్ తో పాటు అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. నోటి దురుసుకు పెట్టింది పేరుగా పాపులరైంది కంగన. తన ముందు ఉన్నది ఎంతటివారైనా ఏకి పారేస్తోంది. రోషన్ లతో పాటు ఎందరో బాలీవుడ్ పెద్దన్నలకే చెమటలు పట్టిస్తూ ఏకు మేకై కూచుంది. లాజిక్ ఏదైనా కానీ.. కంగన యాటిట్యూడ్ కి వీరాభిమానులు ఏర్పడ్డారు. ఆర్జీవీ అంతటి వాడే కంగన పేరు చెబితే ఫిదా అయిపోతున్నాడు. తనకు వారసురాలిగా ఫీలవుతున్నాడు. నరం తెగిన కంగన నాలుక ప్రతి సందర్భంలో ఎవరో ఒకరిని చెడామడా కడిగేస్తోంది. నెప్టోయిజం మొదలు - సాటి స్టార్ల రెక్లెస్ యాటిట్యూడ్ ని కంగన తనదైన శైలిలో బయట పెడుతోంది. అసలు ఇండస్ట్రీ తనని పట్టించుకోనందుకు ఫిరంగిలా విరుచుకుపడుతోంది. అందుకు కారకులపై కక్ష తీర్చుకుంటోంది. ఆ క్రమంలోనే మహేష్ భట్ వారసురాలు - యంగ్ బ్యూటీ ఆలియా భట్ పైనా తనదైన శైలిలో ధుమధుమ లాడింది క్వీన్. `రాజీ` సినిమా ఘనవిజయం సాధించిందంటే అది ఆలియాను చూసి కాదు!! అని తిట్టేసింది.
``అది కరణ్ జోహార్ సినిమానా.. ఆలియా సినిమానా అన్నది కాదు.. అది సెహ్మత్ ఖాన్ అనే ఒక అమ్మాయి కథ. దేశం కోసం తనని తాను అర్పించుకున్న డేరింగ్ గాళ్ కథ`` అంటూ `రాజీ` క్రెడిట్ ఆ ఇద్దరికీ దక్కకుండా చేసింది క్వీన్. రాజీ ట్రైలర్ చూసి అర్థగంట సేపు నేనే ఫోన్ చేసి ఆలియా - మేఘనా ఇద్దరితోనూ మాట్లాడాను. నా సినిమా విషయానికి వచ్చేసరికి వాళ్ల నుంచి స్పందనే ఉండదు అని తిట్టేసింది. ఇంకా చెప్పాలంటే నెప్టోయిజం బ్యాచ్ తిత్తి తీసింది. అయితే కంగన కామెంట్లపై ఆలియాని మీడియా ప్రశ్నించింది. దీనికి పాపం.. కుర్ర భామ కాస్తంత తత్తరపడి తమాయించుకుని సమాధానమిచ్చింది.
తెలిసో తెలియకో అలా జరిగిపోయి ఉంటుంది. కావాలని ఇంటెన్షనల్ గా అలా చేయలేదు!! అంటూ ఒక మెట్టు దిగి వచ్చింది ఆలియా. తనను హర్ట్ చేసి ఉంటే సారీ చెబుతాను! అంటూ పూర్తిగా దిగొచ్చి మాట్లాడింది ఆలియా(25). ``తనకు నేను నచ్చను అని అనుకోవడం లేదు. నచ్చుతాననే అనుకుంటున్నా. నేనేం చేసినా తనని బాధపెట్టాలని చేయలేదు. వ్యక్తిగతంగా సారీ చెబుతాను. ప్రతిసారీ క్వీన్ నాకు ఎంతో నచ్చుతుందని చెప్పాను. ఒక నటిగా - వ్యక్తిగా రెండు రకాలుగా తనని ఇష్టపడతాను. కంగన ధైర్యం నచ్చుతుంది. బయటకు మాట్లాడే తత్వం నచ్చుతుంది. నా విషయంలో తనకు తలెత్తిన ఇబ్బంది ఏంటో నాకు తెలీదు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నాను. నేను ఎవరినీ బాధ పెట్టను`` అని అంది.