పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చిన అలియాభ‌ట్

Update: 2022-11-06 08:42 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పండింటి పాపకు జన్మనిచ్చారు. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్‏తో కలిసి ముంబైలోని రిల‌య‌న్స్  ఆసుపత్రిలో చేరిన ఆలియా.. మధ్యాహ్నం సమయంలో ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు.

రణబీర్‏తోపాటు సోనీ రజ్దాన్.. నీతూ కపూర్ ఆసుపత్రిలో అలియాతో ఉన్నారు. పాప రాకతో కపూర్ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌దుల్లేవ్. ఇక‌ సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు ఆలియా-ర‌ణ‌బీర్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలియాభ‌ట్-ర‌ణ‌బీర్ క‌పూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహ బందంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వివాహం ఘ‌నంగా జ‌రిగింది. అటుపై  పెళ్లైన రెండు నెలలకే ఆలియా గ‌ర్భం దాల్చిన విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు.  అయినా షూటింగ్ ల‌కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా  గర్భిణీగా ఉన్న సమయంలోనూ షూటింగ్స్.. ప్రమోషన్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఇదే ఈ ఏడాది దంప‌తులిద్ద‌రు క‌లిసి న‌టించిన `బ్ర‌హ్మ‌స్ర్త` మొద‌టి భాగం రిలీజ్ అయింది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది. వ‌రుస‌ ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది ప‌డుతోన్న బాలీవుడ్ కి ఈ సినిమా ఓ పెనింగ్స్ తో ఊపిరి పోసింది. ఆ  ర‌కంగా ఈ జంట వివాహం బాలీవుడ్ కి సెంటిమెంట్ గా మారింది.

అలాగే అలియా గ‌ర్భంతోనే ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. సాహ‌సోపేత‌మైన‌ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో సైతం భ‌య‌ప‌డ‌కుండా పాల్గొన్నారు. ఆ విష‌యంలో అలియా హీరోయిన్లంద‌రికీ ఆద‌ర్శంగానూ నిలిచింది.  ప్ర‌స్తుతం ఆమె క‌థానాయిక‌గా ప‌లు సినిమాలు చేస్తోంది. తాజాగా  మాతృమూర్తిగా ప్ర‌మోట్ అయిన నేప‌థ్యంలో కొన్ని నెల‌లు పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.  కోలుకున్న అనంత‌రం మ‌ళ్లీ షూట్ లో బిజీ కానుంది. తెలుగు సినిమా `ఆర్ ఆర్ ఆర్` లో అలియా సీత పాత్ర‌లో మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ర‌ణ‌బీర్  న‌టుడిగా బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో `యానిమ‌ల్`  సినిమాలో న‌టిస్తున్నాడు.
Tags:    

Similar News