రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గానే క‌ళ్ల‌న్నీ జాన్వీ పైనే!

Update: 2021-07-14 05:31 GMT
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ కి ఇంటా బ‌య‌టా ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇండ‌స్ట్రీ బెస్ట్ ఫ్యాష‌నిస్టాగా ఓ వెలుగు వెలుగుతోంది. సోన‌మ్ క‌పూర్ త‌ర్వాత క‌పూర్ ఫ్యామిలీలో వైబ్రేంట్ స్టైలిష్‌ గాళ్ గా పాపుల‌ర‌వుతోంది. జాన్వీ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసే ఫోటోలు వీడియోల‌కు అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ల‌క్ష‌లాదిగా నెటిజ‌నులు ఈ ఫోటోల‌ను వీడియోల‌ను వైర‌ల్ చేస్తున్నారు.

ఇటీవ‌ల మాల్దీవుల విహారం నుంచి వ‌రుస బికినీ ఫోటోలు వీడియోల‌తో అగ్గి రాజేసిన జాన్వీ బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్లతో హీట్ పెంచుతోంది. జాన్వీ యోగా జిమ్ సెష‌న్స్ స‌హా పూల్ సైడ్ ట్రీట్ గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

జాన్వీ ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప‌బ్లిక్ రోడ్ లో చిట్టి పొట్టి నిక్క‌రుతో జాన్వీ జాగింగ్ .. జిమ్ డ్రెస్ లో వేడెక్కించే స్టింట్ కోసం కెమెరా క‌ళ్లు కాపు కాసుకుని వెయిట్ చేయడం చూస్తున్న‌దే. తాజాగా జాన్వీ ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌ప‌డుతూ జ‌నం క‌ళ్లను త‌న‌వైపు తిప్పేసుకుంది. జాన్వీ టాప్ టు బాట‌మ్ నేవీ బ్లూ అథ్లెటైజ‌ర్ లుక్ తో ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. జాన్వీని ఇలా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అంటూ అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.

బ్లూ కలర్ ట్రాక్ ప్యాంట్.. బ్లూ క్రాప్ టాప్ దానిపై షీర్ జాకెట్ ధరించి పింక్ మాస్క్ ధరించిన జాన్వీ.. రెస్టారెంట్ నుండి బయట వేచి ఉన్న త‌న‌ కారు వైపు వెళ్లింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వి  న‌టించిన `దోస్తానా 2` చిత్రం సెట్స్ పై ఉంది. కార్తీక్ ఆర్యన్  ఈ చిత్రం నుండి నిష్క్రమించినట్లు ధ‌ర్మ సంస్థ‌ ప్రకటించడంతో దోస్తానా 2 హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది. త‌దుప‌రి జాన్వీ మ‌రిన్ని భారీ చిత్రాల్లో నటించ‌నుంది.
Tags:    

Similar News