పెళ్లికి నోనో.. త్రిషకి అందరూ ఫ్రెండ్సే

Update: 2016-01-27 09:30 GMT
చెన్నై బ్యూటీ త్రిష సినీ రంగంలో హాఫ్ సెంచరీ కొట్టేసింది. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. మరి ఈ బ్యూటీకి ఎవరంటే ఇష్టం అంటే.. ఇంట్రెస్టింగ్ డీటైల్స్ చెప్పింది త్రిష. ఈ భామ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కి పెద్ద ఫ్యాన్ అట. అఫ్ కోర్స్ ఇలా చెప్పడంలో ఈమె ఇంటెలిజెన్స్ ప్రదర్శించింది లెండి. సౌత్ హీరోల్లో ఎవరి పేరు చెప్పినా.. ఫ్యాన్స్ నుంచి ఏదో ఒక ప్రాబ్లెం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ సల్లూభాయ్ పేరు చెబితే అంతగా పట్టించుకోరు కదా.

అందుకే మీరు పని చేసిన హీరోల్లో ఎవరింటే ఇష్టం అని అడిగితే పెద్ద లిస్ట్ చదివింది. టాలీవుడ్ - కోలీవుడ్ లలో దాదాపు హీరోల అందరి పేర్లు చెప్పేసింది.   అజిత్ - సిద్ధార్ధ్ - పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - ప్రభాస్ - ఎన్టీఆర్ లు బాగా ఇష్టమట. హీరోయిన్లలో అయితే హన్సిక - శృతి హాసన్ లు నచ్చుతారని అంటోంది. అయితే.. ఎవరూ బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్లు మాత్రం లేరట. పెళ్లి గురించి అడిగితే.. ఇంకా డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది ఈ భామ నుంచి. ప్రస్తుతానికి ఆమె బ్రెయిన్ లో అసలు పెల్లి ఆలోచనలే లేవట. ఇప్పటికైతే సినిమాలు పని తప్ప వేరే దానిపై దృష్టి పెట్టనని అంటోంది.

రీసెంట్ గా పీటలపైకి రాబోయిన పెళ్లి ఆగిపోవడమే ఇలా చెప్పడానికి కారణం అనుకుంటున్నారు. అయితే, ఇప్పట్లో పెళ్లి లేదని త్రిష చెప్పడంతో.. ఆమె ఫ్యాన్స్ మాత్రం ఖుషీగా ఉన్నారు. పెళ్లయ్యాక సినిమాలు మానేసే ఛాన్స్ ఉందని గతంలో ఓసారి చెప్పడమే ఇందుకు కారణం.
Tags:    

Similar News