ఓటీటీ ప్లాట్ ఫామ్ అనేది కొత్త వారికి మరియు ఫేడ్ ఔట్ అవుతున్న వారికి మంచి అవకాశంగా మారింది. సినిమాల్లో ఛాన్స్ ల కోసం చూస్తున్న వారు మరియు సినిమాల్లో ఛాన్స్ లు లేక మెల్ల మెల్లగా కనుమరుగు అవుతున్న వారు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఓటీటీ ద్వారా మళ్లీ ఫేమ్ రావడంతో పాటు డబ్బులు కూడా సంపాదించుకునే వీలు ఉంది. అందుకే పలువురు నటీ నటులు మరియు దర్శకులు కూడా ఓటీటీ కంటెంట్ మేకింగ్ పై దృష్టి పెట్టారు.
వెబ్ సిరీస్ లో స్టార్స్ కంటే కూడా అధికంగా ఆఫర్లు లేని ఫేడ్ ఔట్ నటీనటులు మాత్రమే నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. తాజాగా హీరోయిన్ అమలా పాల్ కూడా వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిందని సమాచారం అందుతోంది. హిందీలో మహేష్ భట్ మరియు జియో స్టూడియో సంయుక్తంగా నిర్మించబోతున్న వెబ్ సిరీస్ కు గాను అమలా పాల్ ను సంప్రదించారట. ప్రస్తుతం ఆఫర్లు లేని కారణంగా ఈ అమ్మడు ఓకే చెప్పిందట.
తమిళం మరియు తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న అమలా పాల్ తో ఒక బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ ను వారు ప్లాన్ చేస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ తో మళ్లీ సినిమాల్లో కూడా ఛాన్స్ వస్తాయనే నమ్మకంతో ఆమె ఉందట. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ను పట్టాలెక్కించనున్నారు. సౌత్ నాలుగు భాషల్లో కూడా ఈ వెబ్ సిరీస్ ను డబ్ చేసి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.