అల్లరోడు కంబ్యాక్ కోసం ఆత్రంగా ఉన్న సంగతి తెలిసిందే. సిల్లీ ఫెలోస్ తో బ్లాక్ బస్టర్ కొట్టి రేస్ లో రేసర్ గా దూసుకుపోదామన్న కసితో ఉన్నాడు. పాత కామెడీ లేదని అంటున్నారు.. ఆ రోజుల్ని తెస్తున్నామని హింటిచ్చాడు. పాత కామెడీ అంటే సన్నివేశానికి తగ్గట్టు జంధ్యాల తరహా హుందా అయిన కామెడీ అన్నది నరేష్ ఉద్ధేశం. భూమి గుండ్రంగా తిరుగుతూ తిరిగి అక్కడికే వచ్చినట్టు - ఇటీవలి కాలంలో డీసెంట్ కామెడీల్నే జనం ఇష్టపడుతున్నారు. ఒకవేళ నరేష్ - సునీల్ - భీమనేని & టీమ్ అలాంటి ప్రయత్నమే సిల్లీ ఫెలోస్ తో చేసిందని ఆశిద్దాం.
ఇకపోతే నరేష్ తాజా చిట్ చాట్ లో ఓ ఆసక్తికర సంగతిని చెప్పాడు. 54 సినిమాల హీరోగా చాలా వాటినే విశ్లేషించుకుని సిల్లీఫెలోస్ చిత్రంలో నటించాను. పంపిణీదారుల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది అని తెలిపారు. ఇక భవిష్యత్ ప్రణాళికల గురించి ముచ్చటిస్తూ గిరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నానని తెలిపారు. మారుతి దర్శకత్వంలో తన సొంత బ్యానర్ లో ఓ చిత్రం ఉంటుందని తెలిపాడు. అది పూర్తి స్థాయిలో ఎక్కువమంది ఆర్టిస్టులతో ఉండేలా `ఎవడిగోల వాడిదే` తరహాలో ఈవీవీ సినిమాలా ఉంటుందని తెలిపాడు.
మీరు దర్శకత్వం వహిస్తారా? అన్న ప్రశ్నకు.. ఆలోచన ఉంది. 2020లో దర్శకత్వం వహిస్తాను. 2020 విజన్ అనే అనుకోండి! అంటూ సరదాగా నవ్వేశాడు నరేష్. ఒకవేళ తాను సినిమా తీస్తే పరిమిత బడ్జెట్ తో కొత్త కుర్రాళ్లతోనే సినిమా తీస్తానని, అనవసర బడ్జెట్లు పెట్టనని తెలిపాడు. హీరోగా తనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో ప్రణాళికబద్ధంగా చేస్తానని తెలిపాడు.